Bangladesh Players and Fans accuse Virat Kohli of fake fielding: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకం చేశాడు. అనంతరం వర్షం కారణంగా బంగ్లాలక్ష్యాన్ని 16 ఓవర్లలో 151కి కుదించగా.. 6 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినా బంగ్లాకు ఓటమి తప్పలేదు.
భారత్ చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్ ప్లేయర్స్, ఫాన్స్ సాకులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆరోపణలు చేస్తున్నారు. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్నప్పుడు కోహ్లీ 'ఫేక్ ఫీల్డింగ్' చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌ను అంపైర్లు గుర్తించలేదన్నాడు. ఫేక్ ఫీల్డింగ్ కారణంగా తమకు ఐదు పరుగులు రాలేదని, ఒకవేళ ఆ రన్స్ వచ్చి ఉంటే బంగ్లా విజయం సాధించేది అని నూరుల్ హసన్ పరోక్షంగా అన్నాడు. మరోవైపు బంగ్లా ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌పై విమర్శలు చేస్తున్నారు.
బంగ్లా లక్ష్య ఛేదన చేస్తున్నప్పుడు ఏడో ఓవర్‌ను అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో బంగ్లా ఓపెనర్ షాంటో డీప్ మిడ్ వికెట్ వైపు షాట్ కొట్టగా.. అర్ష్‌దీప్ బంతిని అందుకొని కీపర్‌కు విసిరాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ తన చేతిలో బంతి లేకున్నా.. నాన్‌స్ట్రైకర్ వైపు త్రో విసిరినట్టు యాక్ట్ చేశాడు. అయితే అప్పటికే బ్యాటర్లు క్రీజ్‌కు చేరువగా వెళ్లిపోయారు. ఈ ఘటనపైనే నూరుల్ హసన్ విమర్శలు చేశాడు. 7వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆపై 16 ఓవర్లకు 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బంగ్లాదేశ్ 145/6 స్కోరుకే పరిమితమైంది.
So this is what Nurul Hassan was talking about that umpires didn't listen on fake fielding by Kohli. There should have been 5 penalty runs here - according to ICC rules. Virat kohli should be banned and fined for fake fielding. #T20WorldCuppic.twitter.com/KXLOy1g5cp
— 𝗭𝗨𝗡𝗔𝗜𝗥𝗔🏏🇵🇰 (@BabarFanGirl56) November 3, 2022
ఐసీసీ రూల్ 41.5 ప్రకారం... బ్యాటర్ పరుగు తీసే సమయంలో ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా లేదా మోసం చేయకూడదు. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘించినట్లు అంపైర్లు గుర్తిస్తే బ్యాటింగ్ చేసే జట్టుకు అదనంగా 5 పరుగులు ఇచ్చే అవకాశం ఉంది. అలానే ఆ బంతిని డెడ్‌గా ప్రకటించొచ్చు. ఇక 28.2.3 రూల్ ప్రకారం.. ఫీల్డర్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని అంపైర్లు గుర్తిస్తే నో బాల్ ఇవ్వొచ్చు. బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులను ఇచ్చే విషయంలో అంపైర్లదే తుది నిర్ణయం. ఫీల్డర్ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని బ్యాటర్ అంపైర్ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. అయితే నిన్నటి మ్యాచ్‌లో బ్యాటర్, అంపైర్లు కానీ కోలి తప్పును గుర్తించలేదు.
Also Read: చెర్రీ ఫాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. సుకుమార్ సినిమా షూట్ కూడా మొదలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook