Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మల కోచ్ కన్నుమూత...సంతాపం తెలిపిన పలువురు ఆటగాళ్లు

Vasoo Paranjape: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే(82) సోమవారం కన్నుమూశారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2021, 03:03 PM IST
  • ప్రముఖ క్రికెట్ కోచ్ వాసు పరంజపే కన్నుమూత
  • సంతాపం తెలిపిన పలువురు ఆటగాళ్లు
  • గవాస్కర్, సచిన్ వంటి దిగ్గజాలకు మెలకువలు నేర్పిన పరంజపే
Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మల కోచ్ కన్నుమూత...సంతాపం తెలిపిన పలువురు ఆటగాళ్లు

Vasoo Paranjape: ముంబై మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజాపే సోమవారం (ఆగస్టు 30) కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. అతను 1956, 1970 మధ్య ముంబై, బరోడా కోసం 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌(First Class carrier)లో అతను 23.78 సగటుతో 785 పరుగులు చేశాడు. అలాగే తొమ్మిది వికెట్లు సాధించాడు. అతను ముంబైలోని దేశీయ క్రికెట్‌లో దాదర్ యూనియన్ కోసం ఆడేవాడు. ఈ జట్టు అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటి. వాసు పరంజాపే(Vasoo Paranjape)21 నవంబర్ 1938 న గుజరాత్‌లో జన్మించారు. జతిన్ పరాంజ్పే అతని కుమారుడు ఇతడు భారతదేశం తరపున ఆడాడు. దీనితో పాటు జతిన్ జాతీయ సెలెక్టర్‌గా కూడా వ్యవహరించారు.

Also Read: Frederique Overdijk: 4 ఓవర్లలో 7 వికెట్లు తీసి T20Is వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన పేసర్ ఫ్రెడ్రిక్

ఆటగాడిగా విరమణ చేసిన తరువాత వాసు పరంజ్‌పే కోచ్‌(Coach)గా మారారు. అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పారు. వీరిలో సచిన్ టెండూల్కర్(sachin), సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), దిలీప్ వెంగ్ సర్కార్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఉన్నారు. వాసు అనేక జట్లకు కోచ్‌గా కూడా చేశారు. జాతీయ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)కి కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఆయన మరణానికి రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

'వాసు పరాంజ్‌పే మరణం నన్ను చాలా బాధపెట్టింది. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు’'..రవిశాస్త్రి(Ravi shastri). ''‘వాసు పరంజ్‌పే మరణవార్త నన్ను కలిచివేసింది. నా కెరీర్‌లో మొదటి రెండు సంవత్సరాలు అతని మార్గదర్శకత్వంలోనే గడిపాను. ఈ సమయంలో చాలా నేర్చుకున్నాను ఆయన జీవితాంతం గుర్తుండిపోతారు'' అని అనిల్ కుంబ్లే(Anil kumble) రాశాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ.. ‘వాసు పరంజ్‌పే తన కెరీర్‌కి పెద్ద సహకారం అందించారన్నారు. తాను ఇప్పటికీ వాసు సర్ సందేశం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News