Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన Harvinder Singh

Harvinder Singh wins bronze medal at Tokyo Paralympics: పురుషుల ఇండివిడ్యువల్ రికర్వ్ ఓపెన్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్ సౌత్ కొరియా ఆర్చర్ కిమ్ మిన్ సును (South Korea's archer Kim Min Su) ఓడించి మొత్తానికి భారత్‌కి కాంస్య పతకం అందించాడు.

Written by - Pavan | Last Updated : Sep 3, 2021, 07:33 PM IST
Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన Harvinder Singh

Harvinder Singh wins bronze medal at Tokyo Paralympics: టోక్యోలో జరుగుతున్న పారాలింపింక్స్‌లో పురుషుల ఇండివిడ్యువల్ రికర్వ్ ఓపెన్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్ కాంస్య పతకం గెల్చుకున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సును 6-5 పాయింట్స్ తేడాతో ఓడించడం ద్వారా హర్విందర్ సింగ్ ఈ విజయం సాధించాడు. 

ఫస్ట్ సెట్స్‌లో 26-24 తేడాతో గెలిచిన హర్విందర్ సింగ్ రెండో సెట్స్‌లో 27-19 తేడాతో వెనుకబడ్డాడు. మళ్లీ థర్డ్ సెట్స్‌లో 28-25 పాయింట్స్ తేడాతో ఆధిక్యంలోకి వచ్చి పై చేయి సాధించిన హర్విందర్ సింగ్ (Harvinder Singh) మొత్తంగా 4-2 పాయింట్స్‌తో లీడ్ లోకొచ్చాడు. నాలుగవ సెట్స్‌లో 25-25 పాయింట్స్‌తో మ్యాచ్ టై అయింది. దీంతో ఇద్దరి మధ్య మొత్తం మ్యాచ్ పాయింట్స్ వ్యత్యాసం 5-3 కి చేరింది.

Also read : Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పథకం.. రజతం సాధించిన ప్రవీణ్ కుమార్

ఐదవసారి జరిగిన సెట్స్‌లో హర్విందర్ సింగ్ 26-27 తేడాతో అపజయం పాలయ్యాడు. దీంతో ఈసారి మ్యాచ్ పాయింట్స్ సైతం టై అయ్యింది. ఇద్దరూ సమాన స్థాయిలో ఉండటంతో షూటౌట్‌తో బ్రాంజ్ మెడల్ డిసైడ్ చేయాల్సి వచ్చింది. షూటౌట్‌లో సౌత్ కొరియా ఆర్చర్ కిమ్ మిన్ సును (South Korea's archer Kim Min Su) ఓడించి మొత్తానికి భారత్‌కి కాంస్య పతకం అందించాడు. 

టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics) నేడు భారత్ సాధించిన పతకాల పట్టికలో ఇది మూడవది. మొత్తంగా ఈ పారాలింపింక్స్‌లో గెలుచుకున్న పతకాలు సంఖ్య 13 కు చేరుకుంది.

Also read : Cristiano Ronaldo: రోనాల్డో నయా రికార్డు...ఫుట్‌బాల్‌ చరిత్రలో 111 గోల్స్‌ చేసిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News