Neeraj Chopra Biopic: తన బయోపిక్ పై ఒలింపిక్ పతక విజేత, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని పతకాలు సాధించేంతవరకు తనపై బయోపిక్ (Neeraj Chopra Biopic) వద్దన్నాడు. అప్పుడే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు.
టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics 2020) ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ల(track and field events)లో పసిడి (Neeraj Chopra Gold Medal) సాధించి 100 ఏళ్ల భారత్ కలను నెరవేర్చాడు నీరజ్. నాటి నుంచి అతడిపై బయోపిక్ రానుందని ఊహాగానాలు వెలువడ్డాయి. తెరపై అతని పాత్ర ఎవరు పోషిస్తారు అనే దాని గురించి చర్చలు జరిగాయి. దీనిపై స్పందించిన నీరజ్.. తనకు క్రీడలే ముఖ్యమని స్పష్టం చేశాడు.
నీరజ్ మాట్లాడుతూ..."బయోపిక్‌ల కోసం నన్ను సంప్రదించారు. అయితే నేను సాధించినదానికి ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకా నా తొలి ఒలింపిక్స్. నేను మరిన్ని పతకాలు సాధించాలి. సినిమా ఫ్లాప్ అవ్వాలని నాకు లేదు. ఎక్కువ మెడల్స్ సాధిస్తే.. సినిమా కూడా హిట్ అవుతుంది. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం క్రీడలపైనే." ఉందన్నాడు.
ఆలోచనా విధానం మారింది: శ్రీజేశ్
ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనతో ప్రజల ఆలోచనా విధానం మారిందని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ శ్రీజేశ్ (PR Sreejesh) అన్నాడు. నీరజ్ బంగారు పతకం సాధించాక.. క్రీడలు, క్రీడాకారులపై విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చాడు. శ్రీజేశ్ (PR Sreejesh) బయోపిక్(Biopic) రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని శ్రీజేశ్ వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook