Cricketers Who Not Run Out: కెరీర్ మొత్తంలో రనౌట్ కాని ప్లేయర్స్ వీరే.. భారత ప్లేయర్ కూడా ఉన్నాడు!

Cricketers Who Not Run Out In Test Cricket. టెస్టు కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ అవ్వని బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అందులో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 14, 2022, 06:19 PM IST
  • కెరీర్ మొత్తంలో రనౌట్ కాని ప్లేయర్స్ వీరే
  • భారత ప్లేయర్ కూడా ఉన్నాడు
  • కపిల్ దేవ్ ఎప్పుడూ రనౌట్ కాలేదు
Cricketers Who Not Run Out: కెరీర్ మొత్తంలో రనౌట్ కాని ప్లేయర్స్ వీరే.. భారత ప్లేయర్ కూడా ఉన్నాడు!

These Five cricketers did not run out in their Test career: క్రికెట్‌లో ప్రతి బ్యాటర్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటారు. ప్రతి మ్యాచులో హాఫ్ సెంచరీ లేదా సెంచరీ బాది జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాలని అనుకుంటారు. ఈ క్రమంలో కొంతమంది బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తారు. ఒక్కోసారి దూకుడుగా బ్యాటింగ్ చేసే క్రమంలో బ్యాటర్ రనౌట్ అవుతాడు. అయితే టెస్టు కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ అవ్వని బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు. అందులో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నారు. ఆ జాబితాలో ఎవరు ఉన్నారో ఓసారి చూద్దాం. 

పీటర్ మే:
1951లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ తరఫున పీటర్ మే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. పీటర్ మే ఇంగ్లండ్ తరఫున 66 టెస్టు మ్యాచ్‌లు ఆడి 13 సెంచరీల సాయంతో 4537 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 235. పీటర్ వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెత్తేవాడు. అయినా కూడా అతడు ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. 

గ్రేమ్ హిక్:
జింబాబ్వేలో జన్మించిన గ్రేమ్ హిక్ ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడాడు. గ్రేమ్ హిక్ ఇంగ్లండ్ తరపున 65 టెస్టులు మరియు 120 వన్డేలు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో 3000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. గ్రేమ్ హిక్ తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ రనౌట్ కాలేదు.

మదాస్సర్ నాజర్:
మదాస్సర్ నాజర్ పాకిస్థాన్ తరఫున 76 టెస్టు మ్యాచ్‌ల్లో 4114 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు ఉన్నాయి. ఇక 122 వన్డేలు ఆడిన నాజర్ 2653 పరుగులు చేశాడు. అతను వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెత్తేవాడు. అయినా  కూడా నాజర్ ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. నాజర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా కూడా చేసారు.

కపిల్ దేవ్:
కపిల్ దేవ్ భారత్ తరఫున 131 టెస్టు మ్యాచ్‌లు ఆడి 5248 పరుగులు, 434 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్‌లో 3000 కంటే ఎక్కువ పరుగులు మరియు 253 వికెట్లు తీసుకున్నాడు. అయితే కపిల్ దేవ్ తన మొత్తం టెస్ట్ కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు. 1983 ప్రపంచకప్‌ను కపిల్‌ భారత్‌కు అందించిన విషయం తెలిసిందే.

పాల్ కాలింగ్‌వుడ్:
పాల్ కాలింగ్‌వుడ్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 2010 ఐసీసీ టీ20 వరల్డ్ ట్రోఫీని గెలుచుకుంది. కాలింగ్‌వుడ్ మొత్తం టెస్ట్ కెరీర్‌లో ఎప్పుడూ రనౌట్ కాలేదు. కాలింగ్‌వుడ్ ఇంగ్లిష్ జట్టు తరఫున 68 టెస్టు మ్యాచ్‌ల్లో నాలుగు వేలకు పైగా పరుగులు చేశాడు.

Also Read: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు కావాలా.. పూర్తి డీటెయిల్స్ ఇవే!

Also Read: Fish Oil: ఫిష్ ఆయిల్‌ని వినియోగించడం వల్ల కాలేయ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News