Team India: టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ వేసిన టాప్ 10 భారత ఆటగాళ్లు వీరే..!

Team India: ఆసియా కప్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఫైనల్‌కు చేరాకుండానే ఇంటి బాట పట్టింది. ఈనేపథ్యంలో టీ20లో బెస్ట్ భారత బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Sep 9, 2022, 05:39 PM IST
  • టీ20ల్లో భారత బౌలర్ల బెస్ట్ బౌలింగ్
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు
  • కీలక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లు
Team India: టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ వేసిన టాప్ 10 భారత ఆటగాళ్లు వీరే..!

Team India: టీ20ల్లో బ్యాటర్ల హవానే కాదు..బౌలర్లు సైతం ఆకట్టుకుంటున్నారు. పరుగుల వరదతోపాటు వికెట్ల ప్రవాహం కొనసాగుతుంటుంది. టీమిండియా తరపున చాలా మంది ఆటగాళ్లు బెస్ట్‌ బౌలింగ్‌తో అలరించారు.

దీపక్ చాహర్..

2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.

భువనేశ్వర్ కుమార్..

ఈనెల 8న అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ రఫ్ఫాడించాడు. కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. తొలి ఏడు ఓవర్లలో తన కోటా పూర్తి చేసి కీలక వికెట్లు పడగొట్టాడు.

చాహల్..

2017లో ఇంగ్లండ్‌పై భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బెస్ట్ బౌలింగ్ వేశాడు. 25 పరుగులు ఇచ్చి ఆరు వికెట్ల తీశాడు.

భువనేశ్వర్ కుమార్..

2018లో దక్షిణాఫ్రికాపై టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోయాడు. 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

కుల్దీప్ యాదవ్..

2018లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్ అలరించాడు. 24/5తో బెస్ట్ బౌలింగ్ వేశాడు.

రవిచంద్రన్ అశ్విన్..

2016లో శ్రీలంకపై అశ్విన్ తనదైన శైలిలో బంతులు సంధించాడు. 8 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

బరిందర్ శ్రాన్..

భారత యువ ఆటగాడు బరిందర్ శ్రాన్ సైతం బౌలింగ్‌తో అదరగొట్టారు. 2016లో జింబాబ్వే మ్యాచ్‌లో 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

అశ్విన్..

ఈజాబితాలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మరోసారి నిలిచాడు. 2014లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 11/4తో బెస్ట్ బౌలింగ్ వేశాడు.

హర్భజన్ సింగ్..

టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఖాతాలోనూ రికార్డు ఉంది. 2012లో ఇంగ్లండ్‌పూ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తిప్పేశాడు. 

ఆర్పీ సింగ్..

దక్షిణాఫ్రికాపై ఆర్పీసింగ్ రెచ్చిపోయాడు. 2007లో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

Also read:Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు రాహుల్ గాంధీనేనా..ఆయన ఏమన్నారంటే..!

Also read:Hair Loss Issues: చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతుందా..ఐతే ఇలా చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News