Ind vs Eng:లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. తొలి టెస్టులో టీమ్ ఇండియాకు గెలిచే అవకాశం వచ్చినా...వరుణుడి కారణంగా అది చేజారింది. రెండో టెస్ట్(Test Match) లో నైనా జయభేరి మోగించాలని భారత్(india) ఊవ్విళ్లూరుతోంది. కీలకమైన రెండు టెస్టుకు ముందు కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడటం రెండు జట్లను కలవరపెడుతోంది.
ఐదు టెస్టుల సిరీస్ లో భారత్(india) బోణీ కొట్టాలంటే కెప్టెన్ కోహ్లీ(Kohli)తో సహ సీనియర్ ఆటగాళ్లు రాణించాల్సి ఉంటుంది. తొలి టెస్టులో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానె(Rahane), నయావాల్ ఛెతేశ్వర్ పుజారా(Pujara) గాడిలో పడాలని.. జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. తొలి టెస్టుకు పక్కన పెట్టిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin)ను ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఆడించే అవకాశాలున్నాయి. ఓపెనర్ గా రాహుల్(Rahul), దిగువన జడేజా బ్యాట్‌తో రాణిస్తుండడం భారత్‌కు ఎంతో కలిసొచ్చే అంశం.
Also Read: ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణి రజనీకు సత్కారం, పలు ప్రోత్సాహకాలు
ఈ మ్యాచ్ కు భారత జట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తికరం. ఎందుకంటే మెుదటి టెస్టులో ఆడిన పేసర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇతడి స్థానంలో ఎవరి అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి. స్పినర్ ను తీసుకోవాలంటే ఆశ్విన్(Ashwin)కు ఛాన్స్ ఇస్తారు లేదా నలుగురు పేసర్లుతో ఆడించాలని జట్టు యజమాన్యం భావిస్తే ఇషాంత్, ఉమేష్ యాదవ్ లలో ఒకరు జట్టులోకి వస్తారు.
ఇంగ్లాండ్ పుంజుకుంటుందా?
తొలి టెస్టులో ఓటమి దిశగా పయనించి వరుణుడి దెబ్బతో డ్రా చేసుకున్న ఇంగ్లండ్(England) రెండో మ్యాచ్‌లో సత్తాచాటాలని భావిస్తోంది. అయితే కెప్టెన్ జో రూట్(Joe Root) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడం.. ఆతిథ్య జట్టును కలవరపరుస్తోంది. ఓపెనర్ రోరీ బర్న్స్‌పై వేటు పడే అవకాశముంది. అతడి స్థానంలో హసీబ్ హమీద్‌కు జట్టులో స్థానం దక్కొచ్చు. . ప్రధాన పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇతడి స్థానంలో సాకిబ్ మహ్మూద్ను తీసుకునే అవకాశాలున్నాయి. పిచ్ స్పిన్నర్లకు సహకారం ఉంటుందని భావిస్తే.. ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తీసుకునే అవకాశముంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook