ఐపీఎల్ 2018 లో మెరిసిన తెలుగు తేజాలు

ఐపీఎల్‌లో తెలుగు తేజాలు మెరిశాయి. క్రికెట్ ఆటగాళ్లు కోట్లకు ధర పలికారు. 

Last Updated : Jan 29, 2018, 12:34 PM IST
ఐపీఎల్ 2018 లో మెరిసిన తెలుగు తేజాలు

ఐపీఎల్ లో తెలుగు తేజాలు మెరిశాయి. రెండు రోజులపాటు ఐటీ నగరం బెంగళూరులో జరిగిన ఆటగాళ్ల వేలంపాటలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ ఆటగాళ్లు కోట్లకు ధర పలికారు. 

1. అంబటి రాయుడు - 2.2 కోట్లు -చెన్నైసూపర్ కింగ్స్ 

అంబటి రాయుడు 1985, సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించిన భారత క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. రాయుడు ఐపీఎల్‌లో 2010లో ప్రవేశించాడు.  నిరుడు ముంబై ఇండియన్స్ జట్టులో ఆడగా.. ప్రస్తుతం చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు. 

2. మహ్మద్ సిరాజ్ - 2.6 కోట్లు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

గతేడాది ఐపీఎల్‌ వేలంలో 2.6 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఈసారి కూడా అదేస్థాయిలో ఆ రేటుకే(2.6 కోట్లు) అమ్ముడైపోయాడు. ఇదివరకు సిరాజ్ సన్‌రైజర్స్‌‌కు ఆడగా.. ఈ సీజన్‌లో బెంగళూరు తరఫున ఆడనున్నాడు. 

3. రోహిత్ శర్మ- 15 కోట్లు - ముంబై ఇండియన్స్ 

రోహిత్ శర్మకు తెలుగు నేలతో బంధం ఉంది. రోహిత్ తల్లి పూర్ణిమ శర్మ వైజాగ్‌కు  చెందినవారు.  రోహిత్‌ను ముంబై ఇండియన్స్ 15 కోట్లకు కొనుగోలుచేసింది. ముంబై ఇండియన్స్ జట్టుకి  కెప్టెన్ గా 2018 ఐపీఎల్‌‌లో వ్యవహరిస్తారు.

Trending News