Yashasvi Jaiswal: స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న టీమిండియా కుర్ర హిట్టర్..

Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డులలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హిట్టర్ ఐసీసీ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2024, 04:30 PM IST
Yashasvi Jaiswal: స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న టీమిండియా కుర్ర హిట్టర్..

Player Of The Month February 2024: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో దుమ్ముదులిపిన టీమిండియా యువ సంచలనం య‌శ‌స్వి జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు ఈ కుర్ర హిట్టర్ ఫిబ్ర‌వ‌రి నెల‌కుగానూ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) అవార్డు గెలుచుకున్నాడు. వుమెన్స్ విభాగంలో ఆసీస్ క్రికెటర్ అనాబెల్ స‌థర్‌లాండ్(Annabel Sathurland) ఈ పురస్కారం దక్కించుకుంది. రీసెంట్ గా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో స‌థ‌ర్‌లాండ్ డ‌బుల్ సెంచ‌రీతో సత్తా చాటింది. 

22 ఏళ్ల జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. రెండు డ‌బుల్ సెంచ‌రీల‌తో ఏడు వందలకుపైగా పరుగుల సాధించి ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. దీంతో అతడిని ఐసీసీ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపిక చేసింది. ఓటింగ్‌లో కేన్ విలియ‌మ్స‌న్, శ్రీ‌లంక ఓపెన‌ర్ ప‌థుమ్ నిస్సంక‌ల‌ను వెన‌క్కి నెట్టి మరీ యశస్వి ఈ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఐసీసీ అవార్డు వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది.. ప్యూచర్ లో ఇలాంటి అవార్డులు మరెన్నో సాధిస్తానని యశస్వి అన్నాడు. 

వినోద్ కాంబ్లీ తర్వాత మనోడే..
ఇంగ్లండ్ తో సిరీస్ లో తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను తిరగరాశాడు. దిగ్గజాల సైతం అందుకోలేని ఘనతలను ఈ చిచ్చర పిడుగు సాధించాడు. రీసెంట్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఈ యువ సంచలనం.. అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన రెండో భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతడు 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకోగా.. మాజీ ఆట‌గాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి ర‌న్స్ కొట్టాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి ప‌రుగుల‌తో పూజారా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

Also Read: T20 WC 2024: బీసీసీఐ బిగ్ స్కెచ్.. టీ20 ప్రపంచ కప్ నుంచి కోహ్లీ ఔట్.. కారణం ఇదే..!

Also Read: Yusuf Pathan: కాంగ్రెస్ అగ్రనేతను ఢీకొట్టబోతున్న యూసుఫ్‌ పఠాన్.. పొలిటికల్ గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షమేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News