Ind Vs Ban: బంగ్లా టూర్‌కు భారత్ సిద్ధం.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇవే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

India Tour Of Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా రెడీ అయింది. మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టుతో మళ్లీ చేరారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 10:30 AM IST
Ind Vs Ban: బంగ్లా టూర్‌కు భారత్ సిద్ధం.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇవే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

India Tour Of Bangladesh: న్యూజిలాండ్ సిరీస్ టూర్ తరువాత బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా బయలుదేరి వెళ్లింది. బంగ్లా టూర్‌కు సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో చేరారు. టీ20 వరల్డ్ కప్ తరువాత ఈ ముగ్గురు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకోగా.. 0-1 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లాదేశ్‌తో పూర్తిస్థాయి జట్టుతో టీమిండియా బరిలోకి దిగనుంది.  

డిసెంబర్ 4వ తేదీన మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగే తొలి వన్డేతో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను ప్రారంభించనుంది. వచ్చే వన్డే వరల్డ్ కప్‌కు టీమ్‌ను రెడీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.  

టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్‌కు కీలకంగా మారనుంది. అదేవిధంగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు బంగ్లా టూర్‌ పరీక్షగా మారనుంది. ముఖ్యంగా పంత్ ఈ సిరీస్‌లో విఫలమైతే.. జట్టులో చోటు గల్లంతవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు విరాట్ కోహ్లి ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బంగ్లా టూర్‌కు కోహ్లీ పూర్తిస్థాయిలో రెడీ అయ్యాడు. ఇటీవల జిమ్‌లో కోహ్లీ కష్టపడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్‌పై ఈ రన్‌ మెషీన్ అదేఫామ్‌ను కంటిన్యూ చేస్తే టీమిండియాకు ఇక తిరుగుండదు. బౌలర్లు కూడా స్థాయి తగ్గ ప్రదర్శన చేస్తే.. బంగ్లాకు కష్టాలే..

హెడ్ టూ హెడ్ రికార్డులు..

భారత్, బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటివరకు 11 టెస్టులు, 36 వన్డేలు, 11 టీ20ల్లో తలపడ్డాయి. బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటివరకు భారత్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించలేదు. వన్డేల్లో భారత్ 30 మ్యాచ్‌లు గెలుపొందగా.. బంగ్లా కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించింది. ఆ ఓటమితో వరల్డ్ కప్ నుంచి టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. 

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ వన్డే సిరీస్: 

మొదటి వన్డే: డిసెంబర్ 4, షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, మీర్పూర్: ఉదయం 11.30 
రెండో వన్డే: డిసెంబర్ 7, షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, మీర్పూర్: ఉదయం 11.30 
మూడో వన్డే: డిసెంబర్ 10, షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, మీర్పూర్: ఉదయం 11.30 

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ టెస్ట్ సిరీస్:

మొదటి టెస్ట్: డిసెంబర్ 14-18, జోహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్: ఉదయం 9.30 

రెండో టెస్ట్: డిసెంబర్ 22-26, షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, మీర్పూర్: ఉదయం 9.30 

టీమిండియా వన్డే టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్

టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

స్ట్రీమింగ్ ఎక్కడ..?

ఇండియా-బంగ్లాదేశ్ సిరీస్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ సిరీస్ SonyLiv వెబ్‌సైట్, యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: PAK Vs ENG: పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ పరుగుల వరద.. స్టేడియంపై డ్యాన్స్‌తో అదరగొట్టిన మహిళ.. వీడియో వైరల్  

Also Read: Revanth Reddy: రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్.. అలర్ట్ అయిన సీనియర్లు.. హైకమాండ్‌కు ఫిర్యాదు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News