Ind vs Ban: ఏడాదిలో అత్యధిక వన్డే వికెట్లు, తొలి భారతీయ బౌలర్‌గా మొహమ్మద్ సిరాజ్

Ind vs Ban: టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్‌గా సిరాజ్ నిలవడం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2022, 11:25 PM IST
Ind vs Ban: ఏడాదిలో అత్యధిక వన్డే వికెట్లు, తొలి భారతీయ బౌలర్‌గా మొహమ్మద్ సిరాజ్

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే సిరీస్ రెండవ మ్యాచ్‌లో అద్భుతాలు నమోదయ్యాయి. రెండవ వన్డే సైతం గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ ఓ రికార్డు సాధిస్తే..టీమ్ ఇండియా బౌలర్ మరో ఘనత సాధించాడు.

టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అద్బుతమైన ఘనత సాధించాడు. 2022 సంవత్సరంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్‌గా ఖ్యాతినార్జించాడు. ఈ ఏడాది 14 వన్డేలు ఆడిన మొహమ్మద్ సిరాజ్..23 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 14 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తీశాడు.

టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండవ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఓ దశలో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌కు మొహమ్మదుల్లా, మెహదీ హసన్‌లు 7వ వికెట్‌కు ఏకంగా 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మెహదీ హసన్ 83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. 

Also read: Rohit Sharma: రోహిత్‌ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News