ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ఈ సారి రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు. టెస్టుల్లో ఒక సీజన్ (ఏడాది) లో అత్యధిక పరుగులు రాబట్టిన భారతీయ బ్యాట్స్‌మెన్ల లో రాహుల్ ద్రవిడ్ (1137 పరుగుల రికార్డు) ఇప్పటి వరకు టాప్ పొజిషల్ ఉన్నాడు. 2002లో రాహుల్ ద్రవిడ్ ఈ ఘనత సాధించాడు.
అయితే రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న కోహ్లీ ఈ రికార్డు సైతం ఈ రోజు బ్రేక్ చేశారు. ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ 82 పరుగులు చేయడంతో ఈ సీజన్ లో మొత్తం 1138 పరుగులు సాధించినట్లుయింది. దీంతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. కాగా గత ఐదు టెస్టుల్లో కలిపి విరాట్ 600 పరుగుల సాధించడం గమనార్హం
రాహుల్ ( 1137 పరుగులు ) తర్వాతి స్థానంలో వెటరన్ ఆటగాడు అమర్ నాథ్ 1983 సీజన్ లో 1,065 పరుగులు చేయగా.. సునీల్ గవస్కార్ 1971లో 918 పరుగుల చేశారు. వీరందిని వెనక్కి నెట్టి వికాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలబడ్డాడు. ఇదిలా ఉండగా కోహ్లీ సాధించిన తాజా ఘతనపై బీబీసీఐ స్పందించింది. 'ద కింగ్ కోహ్లీ' కాప్షన్ ఇచ్చి కోహ్లీ సాధించిన ఘనతను ప్రకటించింది