Team India Best Captain: టెస్టు ఫార్మాట్ లో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఉత్తమ కెప్టెన్?

Team India Best Captain: విరాట్ కోహ్లీ కంటే మెరుగైన టెస్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలుస్తాడని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఇటీవలే సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని అన్నాడు. అయితే టీమ్ఇండియా కెప్టెన్సీని సరైన వ్యక్తి చేతుల్లో పెట్టారని ఆయన ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 01:52 PM IST
Team India Best Captain: టెస్టు ఫార్మాట్ లో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఉత్తమ కెప్టెన్?

Team India Best Captain: టెస్టు ఫార్మాట్ లో టీమ్ఇండియాను ఓ ప్రత్యేక స్థానానికి చేర్చడానికి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతగానో కృషి చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ టీమ్స్ సరసన ఇప్పుడు ఇండియా కూడా చేరింది. అనేక ఊహాగానాలు, విమర్శల మధ్య అన్నీ ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ఇటీవలే ప్రకటించాడు. దీంతో టీమ్ఇండియా కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికైన తర్వాత టీమ్ఇండియా ఎక్కువ విజయాలను అందుకుంది. ఇటీవలే శ్రీలంకతో జరిగిన సిరీస్ లోనూ రోహిత్ సేన విజయకేతనం ఎగురవేసింది. 

అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎదుగుదలపై మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ స్పందించాడు. విరాట్ కోహ్లీ కంటే అత్యుత్తమ టెస్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలుస్తాడని ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. సరైన వ్యక్తి చేతుల్లోకి టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు వెళ్లాయని జాఫర్ అభిప్రాయపడ్డాడు. 

"విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా రోహిత్ శర్మ టెస్టుల్లో ఉత్తమ కెప్టెన్ గా నిలుస్తాడు. రోహిత్ శర్మ ఎన్ని టెస్టు మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడో నాకు తెలియదు. కానీ, రోహిత్ శర్మ అత్యుత్తమ సారథుల్లో ఒకడిగా నిలవడం ఖాయం. టీమ్ఇండియా ఇటీవలే సాధించిన వరుస విజయాలే అందుకు నిదర్శనం. సరైన వ్యక్తిని జట్టు కెప్టెన్ గా నియమించారు" అని వసీమ్ జాఫర్ అన్నాడు.  

Also Read: Rajasthan Royals Captain: బ్రేకింగ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా యుజ్వేంద్ర చాహల్!

Also Read: Jhulan Goswami ODI Wickets: చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా క్రికెటర్ జులన్ గోస్వామి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News