Afghanistan Cricket: తాలిబన్ల చేతిలో ఆఫ్ఘన్ క్రికెట్ కార్యాలయం, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై నీలినీడలు

Afghanistan Cricket: ఆఫ్గన్ నేలను తాలిబన్లు ఆక్రమించడంతో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ క్రికెట్‌పై నీలినీడలు కమ్మకున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కార్యాలయంలో తాలిబన్లు ప్రవేశించిన ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2021, 12:50 PM IST
Afghanistan Cricket: తాలిబన్ల చేతిలో ఆఫ్ఘన్ క్రికెట్ కార్యాలయం, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై నీలినీడలు

Afghanistan Cricket: ఆఫ్గన్ నేలను తాలిబన్లు ఆక్రమించడంతో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ క్రికెట్‌పై నీలినీడలు కమ్మకున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కార్యాలయంలో తాలిబన్లు ప్రవేశించిన ఫోటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)దేశంపై తాలిబన్లు మరోసారి పంజా విసిరారు. ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించి దేశాన్ని ఆక్రమించడంతో పరిణామాలు వేగంగా మారడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడు ఆ దేశంలో ఊపిరి పోసుకుంటున్న క్రికెట్ ఆటపై నీలీనీడలు కమ్ముకుంటున్నాయి. దీనికి కారణం తాలిబన్లకు క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పటికే తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ప్రవేశించారు.కాబూల్‌లోని ఈ కార్యాలయంలో తాలిబన్ల(Talibans)వెంట ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్ అబ్దుల్లా మజారీ ఉండటం విశేషం. ప్రస్తుతం ఆఫ్ఘన్ క్రికెట్ కార్యాలయం తాలిబన్ల చేతిలో ఉంది. 

క్రికెట్ ఇప్పుడిప్పుడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు(Afghanistan Cricket Team)పటిష్టమవుతోంది. తక్కువకాలంలో మేటిజట్లను మట్టికరిపించిన ఘనత ఆఫ్ఘన్ క్రికెట్ టీమ్‌ది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌కు ఆ దేశపు ఆటగాళ్లు చాలా శ్రమిస్తున్నట్టు సమాచారం. ఈ తరుణంలో తాలిబన్లు ఆఫ్ఘన్ క్రికెట్ జట్టును అనుమతిస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో హమీద్ షిన్వరీ స్పష్టత ఇచ్చారు.సెప్టెంబర్ 1 నుంచి 5 వరకూ శ్రీలంకలో పాకిస్తాన్-ఆప్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.ఇప్పుడీ సిరీస్ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan cricket board) మాత్రం తమ సిరీస్‌కు తాలిబన్లు అంగీకరించారంటూ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also read: IPL 2021: పూల్ వాలీబాల్ ఆడిన Mumbai Indians

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News