India Vs Pakistan: 'షమీ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ'.. బూతులు తిడుతున్న నెటిజన్లు

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.. అయితే షమీ ఇచ్చిన పరుగుల వల్లే ఇండియా ఓడిపోయిందని.. బౌలర్ మహామ్మద్‌ షమీని ఇన్‌స్టాగ్రామ్ లో బూతులు తిడుతున్నారు నెటిజన్లు

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 05:11 PM IST
  • 10 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచిన పాకిస్తాన్
  • భారత్ ఓటమికి షమీ కారణమంటూ ట్రోల్స్
  • షమీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో బూతులు తిడుతున్న అభిమానులు
India Vs Pakistan: 'షమీ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ'.. బూతులు తిడుతున్న నెటిజన్లు

Making Obscene Comments on Shami's Posts on Instagram: క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసిన మ్యాచ్ ముగిసింది. దుబాయ్ (Dubai) స్డేడియంలో టీమిండియా Vs పాకిస్తాన్ (Team India Vs Pakistan) మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేసి... రికార్డు నెలకొల్పింది. 

మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన భారత్ తడబడిన.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  (Virat Kohli) 57 పరుగులు, రిషభ్‌ పంత్‌ (Rishab Pant) 39 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి 151 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచారు.. కానీ లక్ష్యం స్వలం అయినప్పటికీ.. పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (Babar Azam), మొహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) నిలకడ ఆటతీరుతో 10 వికెట్లతో గెలిచిన సంగతి తెలిసిందే.. 

Also Read: Venu Swami Comments on Rakul: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. రకుల్ ఎంగేజ్మెంట్ ఆగిపోనుందట..!!

అయితే కొందరు భారత్ అభిమానులు (Team India Fans) టీమిండియా ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహామ్మద్‌ షమీ (Mohammad Shami) యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడు పెట్టిన పోస్ట్ లపై బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు 

నిజానికి నిన్నటి మ్యాచ్ లో షమీ 3.5 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే టీమిండియా (Team Inida) మ్యాచ్ ఓడిపోవడానికి షమీ ఇచ్చుకున్న పరుగులే కారణమంటూ నెటిజన్లు షమీని ఒక రేంజ్ లో తిడుతూ ట్రోల్ చేస్తున్నారు. 

Also Read: National Film Awards 2021: ఒకే రోజు, ఒకేస్టేజీపై మామ అల్లుళ్లకు అవార్డులు..ఆనందంలో సూపర్ స్టార్ ఫాన్స్

'బోసిడికే'.. 'పాక్ నుండి ఎన్ని డబ్బులు నొక్కేసావో చెప్పు'.. 'టీమిండియాలో ఒక పాకిస్తానీ ఉన్నాడు'.. 'పాకిస్తాన్ వెళ్ళిపో'... 'ఇక రిటైర్మెంట్‌ తీసుకో'... అంటూ అనేక రకాలుగా కామెంట్లు పెడుతూ.. బౌలర్ మహామ్మద్‌ షమీని ట్రోల్స్ చేస్తున్నారు. 

మరి కొంత మంది షమీ ఒక్కడినే బ్లేమ్ చేయటం తగదని... ఇది పూర్తీ జట్టు వైఫల్యమని.. ఇలా ఒక ఆటగాడిపై విరుచుకు పడటం మంచిది కాదంటూ.. మరి కొందరు షమీకి తోడుగా నిలుస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News