David Wiese: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)లో నమీబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వీస్(David Wiese) చరిత్ర సృష్టించాడు. వరుస ప్రపంచకప్‌లలో రెండు వేర్వేరు దేశాలకు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
2016 ప్రపంచకప్‌లో జన్మస్థలమైన దక్షిణాఫ్రికా(South Africa)కు ప్రాతినిధ్యం వహించిన వీస్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తన తండ్రి స్వస్థలమైన నమీబియా(Namibia) తరఫున ఆడుతున్నాడు. 36 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వీస్.. 2013లో దక్షిణాఫ్రికా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేసి 6 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన వీస్.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.
Also read: Rishab Pant: ఒంటి చేత్తో కళ్లు చెదిరే సిక్స్ కొట్టిన పంత్.. వీడియో వైరల్
2019లో నమీబియా టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై కావడంలో కీలకపాత్ర పోషించిన వీస్.. నాటి నుంచి ఆ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం(అక్టోబర్ 18) శ్రీలంకతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్(Qualifying match)లో బరిలోకి దిగిన అతను.. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 96 పరుగులకే ఆలౌట్ కాగా.. శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో అన్నీ అనుకూలించి నమీబియా సూపర్ 12 స్టేజ్‌కి చేరితే.. అక్కడ దక్షిణాఫ్రికాతో తలపడే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి