Team India Squad for T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కు జట్లను ప్రకటించడానికి మే 01 చివరి తేదీగా నిర్ణయించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ టీమ్స్ ను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. ఈనేపథ్యంలో అందరి చూపు భారత్ పైనే ఉంది. జూన్ 02న నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు సంబంధించి భారత జట్టులో ఎవరెవరు ఉంటారు అనేదే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. టీమిండియా యెుక్క 15 మంది సభ్యులను ప్రకటించడానికి బీసీసీఐకు ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది.
ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు తమ జట్లను ప్రకటిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్, వసీం జాఫర్ లు తమ టీమ్స్ ను ఎంపిక చేశారు. జట్టులో ఐదుగురు బౌలర్లు ఉండాలని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ వంటి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని అన్నాడు. బౌలింగ్ బాగున్నప్పటికీ ఫీల్డింంగ్ నైపుణ్యాల ఆధారంగా చాహల్‌ను ఎంపిక చేయలేదు. జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ఏకైక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని పఠాన్ అన్నాడు.
జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?
మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే జట్టులోని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కొన్ని స్థానాలకు పోటీ ఎక్కువగా ఉండటంతో ఎవరినీ ఎంపిక చేయాలనే విషయంలో సెలక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అందుకే టీమ్ ఎంపిక కష్టతరమవుతుంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కు ఫిట్‌గా ఉన్నాడో లేదో సెలెక్టర్లు తేల్చాల్సి ఉంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కీపర్స్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ అద్భుతంగా ఆడుతున్ సంజూ శాంసన్ నుంచి వీరికి గట్టిపోటీ ఉంది. ఆల్ రౌండర్ కేటగిరీలో శివమ్ దూబేను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి. అందుతున్న సమాచారం ప్రకారం, భారత జట్టును చివరి రోజైన మే 01న ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: RCB PlayOff Chances: ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరు? ఆర్సీబీకి అవకాశాలున్నాయా?
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు పంత్ పిక్స్.. తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి