T20 World Cup 2022: మెగా టోర్నీకి కౌంట్ డౌన్..యూఏఈ తుది జట్టు ఇదే..!

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. వచ్చే నెల మెగా టోర్నీ ఆరంభంకానుంది. ఈక్రమంలోనే తుది జట్లను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటిస్తున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Sep 18, 2022, 11:29 AM IST
  • టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్
  • వచ్చే నెల మెగా టోర్నీ
  • యూఏఈ టీమ్ ప్రకటన
T20 World Cup 2022: మెగా టోర్నీకి కౌంట్ డౌన్..యూఏఈ తుది జట్టు ఇదే..!

T20 World Cup 2022: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు..తమ జట్టును వెల్లడించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును యూఏఈ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మెగా టోర్నీకి సీనియర్ ఆటగాడు రోహన్ ముస్తఫా ఎంపిక కాలేదు. వరల్డ్ కప్‌లో ఆ జట్టును సీపీ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆ దేశ యువ పేసర్ అయాన్ ఖాన్‌కు చోటు దక్కింది. 

ఐసీసీ వరల్డ్ కప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్, నమిబీయా జట్లతో యూఏఈ జట్టు క్వాలిఫెయర్ మ్యాచ్‌లను ఆడనుంది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 13 వరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈమెగా టోర్నీ రసవత్తరంగా సాగనుంది. అంతకంటే ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో మూడు టీ20ల సిరీస్‌ల్లో భారత్ తలపడనుంది.

ఈనెల 20న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. 23న రెండో టీ20, 25న హైదరాబాద్‌ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ జరగబోతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీమిండియా ఆడనుంది. ఇప్పటికే జట్లను బీసీసీఐ ప్రకటించింది.

యూఏఈ జట్టు: సీపీ రిజ్వాన్(కెప్టెన్), వృత్త్యా అరవింద్(వైస్ కెప్టెన్), చిరాగ్ సూరి, మహమ్మద్ వసీం, బాసిల్ హమీద్, ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, కాషిఫ్‌ దౌద్, కార్తీక్ మెయ్యప్పన్, అహ్మద్ రజా, జహూర్ ఖాన్, జునైద్ సిద్దిక్, సబీర్ అలీ, అలీషన్ షరాఫు, అయాన్ ఖాన్.

Also read:Chandigarh University: 60 మంది విద్యార్థుల బాత్ రూం వీడియోలు లీక్.. పంజాబ్ యూనివర్శిటీలో దారుణం

Also read:NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ వేట..ఉగ్ర మూలాలపై ఏకకాలంలో సోదాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News