T20 World Cup 2022: టీమిండియాకు మళ్లీ షాక్... మరో స్టార్ ప్లేయర్​కు గాయం..

T20 worldcup 2022: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. తాజాగా మరో కీలక ఆటగాడు గాయం అయినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 07:55 AM IST
T20 World Cup 2022: టీమిండియాకు మళ్లీ షాక్... మరో స్టార్ ప్లేయర్​కు గాయం..

T20 worldcup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కీలక ఆటగాళ్లు బుమ్రా, జడేజాలతో పాటు స్టాండ్ బైగా ఉన్న దీపక్ చాహర్ జట్టుకు దూరమయ్యారు. తాజాగా మరో స్టార్ ఆటగాడికి గాయమైనట్లు తెలుస్తోంది. అతడే రిషభ్ పంత్.

సోమవారం గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన భారత వార్మప్ మ్యాచ్‌లో పంత్ (Rishabh Pant) ఆడలేదు. మోకాలి హీల్ ప్యాడ్ ధరించి డగౌట్ లో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అంతకముందు వెస్టర్న్ ఆస్ట్రేలియా  జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ పంత్ ఆడలేదు. అయితే అతడు గాయం కారణంగానే ఈ మ్యాచ్ ల్లో ఆడనట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్ కీపర్ గాయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 187 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. టీమిండియా ఆటగాళ్లులో షమీ నాలుగు వికెట్లు తీశాడు. చివరి 4 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సమయంలో ఒక్క రన్ ఇవ్వకుండా నాలుగు వికెట్స్ తీశాడు.  

Also Read: West Indies vs Scotland: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. హిట్టర్లకు మారుపేరు వెస్టిండీస్‌ను ఓడించిన పసికూన స్కాట్లాండ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News