T20 World Cup 2022 Live Updates: అత్యాచారం కేసులో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక (Danushka Gunathilaka) నిన్న సిడ్నీలో అరెస్టయ్యాడు. ఈ ఉదయం శ్రీలంక జట్టు అతను లేకుండానే స్వదేశానికి వెళ్లిపోయింది. మూడు వారాల క్రితం గుణతిలక గాయపడగా, అతని స్థానంలో అషెన్ బండార జట్టులో చేరాడు. కానీ టీమ్ మేనేజ్మెంట్ గుణతిలకను ఇంటికి పంపకుండా జట్టుతోనే కొనసాగించింది.
ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై దనుష్కను అరెస్టు చేసినట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. డేటింగ్ యాప్ ద్వారా దనుష్క గుణతిలకకు పరిచయమైన 29 ఏళ్ల మహిళ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఈ వారం ప్రారంభంలో సిడ్నీలోని ఒక నివాసంలో ఈ సంఘటన జరిగింది. శ్రీలంక క్రికెటర్‌ను నిన్న రాత్రి టీమ్ హోటల్లో అరెస్టు చేశారు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.
వరల్డ్ కప్ లో ముగిసిన లంక కథ
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా... నిన్న శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించడంతో శ్రీలంక ఇంటిదారి పట్టింది. ఇంగ్లాండ్ 4 వికెట్లు తేడాతో లంకపై గెలిచి సెమీస్ కు చేరింది. మెుదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది. బెన్ స్టోక్స్ అద్భుతంగా ఆడి ఆ జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. దీంతో లంక ఇంటిదారి పట్టింది.
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి