T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే ప్రాంతాలివే

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు, ఎక్కడ పోటీలు జరగనున్నయో ఐసీసీ తెలిపింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2022, 02:28 PM IST
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే ప్రాంతాలివే

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు, ఎక్కడ పోటీలు జరగనున్నయో ఐసీసీ తెలిపింది.

టీ20 ప్రపంచకప్ 2022 ఆస్ట్రేలియాలో జరగనుంది. దీనికి సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. టీ20 ప్రపంచకప్‌లోని మెగా టోర్నీల వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియాలోని మొత్తం 7 వేదికలపై ఈ టోర్నీ జరగనుంది. మెల్‌బోర్న్, హోబర్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గీలాంగ్ నగరాల్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయని ట్విట్టర్ వేదికగా వెల్లడైంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొనబోతున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరగనున్న ఈ టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే వెల్లడైంది.

ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో 2021 జూన్ నాటికి టాప్-8లో ఉన్న జట్లు నేరుగా టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022)కు అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాలకై క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20 ప్రపంచకప్ కోసం ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లేదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లండ్ జట్లు క్వాలిఫయర్స్‌లో తలపడతాయి. 2021 టీ20 ప్రపంచకప్‌ను తొలిసారిగా ఆస్ట్రేలియా గెల్చుకుంది. 

Also read: IPL 2022: అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News