Pak Controversy Decision: పాకిస్తాన్ జట్టుపై కొత్త వివాదం, ఫైనల్ రోజు ఉపవాసం ఆచరించనున్న పాక్ క్రికెటర్లు

Pak Controversy Decision: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్‌కు మరి కొద్ది గంటలే మిగిలింది. ఈ క్రమంలో కొత్త వాదన బయటికొస్తోంది. పాకిస్తాన్ జట్టు తీసుకున్న నిర్ణయంపై షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 12, 2022, 07:36 PM IST
Pak Controversy Decision: పాకిస్తాన్ జట్టుపై కొత్త వివాదం, ఫైనల్ రోజు ఉపవాసం ఆచరించనున్న పాక్ క్రికెటర్లు

టీ20 ప్రపంచకప్ 2022 తుది పోరుకు మరి కొద్దిగంటలే మిగిలింది. టీ 20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు తీసుకున్న నిర్ణయం షాకింగ్ కల్గిస్తోంది. వివాదాస్పదమౌతోంది. ఆ నిర్ణయమేంటి, ఆ వివాదమేంటి..

టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్లు వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ అద్భుత ప్రదర్శన కన్పించింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ పాకిస్తాన్ ఫైనల్‌లో ప్రవేశించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ జట్టుకు చెందిన విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. క్రీడా మైదానంపై పాక్ క్రికెటర్లు ధర్మయుద్ధానికి తెరలేపారనే విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లంతా విజయానికి అల్లాహ్‌కు కృతజ్ఞతలు అర్పిస్తున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు అక్కడి నేతలు కూడా ఈ మ్యాచ్‌ను ధర్మయుద్ధంగా భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పాకిస్తాన్ సాధించిన విజయం..ఇస్లామిక్ విజయమని ఓ పాకిస్తాన్ నేత చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ విషయాల గురించి తెలుసుకుందాం..

ఆదివారం జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ ఓడించేందుకు పాకిస్తాన్ జట్టు ఉపవాసం ఉండేందుకు నిర్ణయించుకున్నారు. 1992లో కూడా ఉపవాసంతో ఆడి..ప్రపంచకప్ విజయం అందుకున్నారు. 

పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కష్టంతో ఆడే క్రికెట్ ఫలితాన్ని పాకిస్తానీ క్రికెటర్లు పైవాడికి అర్పిస్తున్నారు. బ్యాట్‌తో పాటు ఎజెండా కూడా ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ జట్టు మత ఆచారాలు వారిష్టమని..దీనిపై విమర్శలెందుకనే ప్రశ్నలు కూడా విన్పిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు మత విశ్వాసాల్ని అంధ విశ్వాసాలుగా, మత ఛాందసవాదంగా ఎలా పరిగణిస్తారని ఇంకొందరు మండిపడుతున్నారు. 

Also read: Babar Azam: వరల్డ్ కప్ గెలిస్తే పాక్ ప్రధానిగా బాబర్ ఆజమ్.. సునీల్ గవాస్కర్ జోస్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News