Suresh Raina takes stunning catch to dismiss Ben Dunk in Road Safety World Series 2022: సురేష్ రైనా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా మాజీ ప్లేయర్ అయిన రైనా.. మంచి బ్యాటర్ మాత్రమే కాదు అంతకుమించి అద్నుత ఫీల్డర్. వేగంగా డైవ్ చేస్తూ బంతిని అడ్డుకుంటాడు. బంతి రైనా వైపు వెళ్లిందంటే ప్రత్యర్థి బ్యాటర్ ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఎన్నో అద్భుత క్యాచులు పట్టి ప్రపంచ ఉత్తమ ఫీల్డర్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా తప్పుకున్నప్పటికీ.. తన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. తాజాగా చిరుత కంటే వేగంగా డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
సురేష్ రైనా ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడుతున్నాడు. సెమీ ఫైనల్ 1లో భాగంగా బుధవారం రాత్రి (సెప్టెంబర్ 28) రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా 16 ఓవర్ వేసిన అభిమాన్యు మిథున్ బౌలింగ్‌లో బెన్ డంక్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా చిరుత కంటే వేగంగా డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
What a dive. What a catch 😱✨@ImRaina you beauty ♥️
Dekhte rahiye @India__Legends vs @aussie_legends in the #RoadSafetyWorldSeries now, only on @Colors_Cineplex, @justvoot, Colors Cineplex Superhits and @Sports18. pic.twitter.com/gXMHxd1KTy
— Colors Cineplex (@Colors_Cineplex) September 28, 2022
సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్‌కు బ్యాటర్ బెన్ డంక్ షాక్ అయ్యాడు. మరోవైపు భారత ఫీల్డర్లందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై ప్లేయర్స్ అందరూ రైనాను హత్తుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైనా క్యాచ్ వీడియో చూసిన అందరూ బిత్తరపోతున్నారు. 'ఫీల్డింగ్‌కా బాప్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సురేష్ రైనా నువ్ తోపు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్ 2022 నుంచి బుమ్రా ఔట్!
Also Read: TS Govt: తెలంగాణలో వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ప్రభుత్వం కీలక నిర్ణయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook