Team India Cricketers: ఫిట్ గా ఉండే టీమిండియా క్రికెటర్లను 'ఫాట్' గా మార్చిన ఇన్‌స్టా అభిమాని...నవ్వుకుంటున్న నెటిజన్లు

Team India Cricketers: టీమిండియా క్రికెటర్లు ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 04:30 PM IST
Team India Cricketers: ఫిట్ గా ఉండే టీమిండియా క్రికెటర్లను 'ఫాట్' గా మార్చిన ఇన్‌స్టా అభిమాని...నవ్వుకుంటున్న నెటిజన్లు

Team India Cricketers: మూడో టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్ల ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత స్టార్ ఆటగాళ్ల ఫొటోలు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ ఫొటోలను చూసిన అభిమానులు నవ్వును ఆపుకోలేకపోతున్నారనడంలో సందేహం లేదు. అసలు ఆ ఫొటోల్లో ఏముందని అనుకుంటున్నారా?..

భారత క్రికెట్ స్టార్ ఆటగాళ్లు(Team India Cricketers) లావుగా ఉంటే ఎలా ఉంటారనే ఆలోచనతో ఓ అభిమాని చేసిన ప్రయత్నం నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది. ఫిట్(Fit)గా ఉండే క్రికెటర్లను ఫాట్ గా తయారు చేయండంలో మనోడు ఎంతో కష్టపడ్డాడు. ఈ ఫొటోలో క్రికెటర్లు ఎంతో లావుగా, బానెడు పొట్టతో కనిపించారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు నవ్వును ఆపుకోలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా(Social Media)లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫిట్‌గా ఉండే మన టీమిండియా క్రికెటర్లు ఇలా అయ్యారేంటి అంటూ కొంతమంది కామెంట్ చేస్తే.. భవిష్యత్తులో మన క్రికెటర్లు ఇలానే తయారవుతారా ఏంటి అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

Also Read: Ind vs Eng 3rd test day 1: ఇండియా vs ఇంగ్లాండ్ 3వ టెస్ట్.. టాస్ గెలిచిన భారత్

ప్రస్తుతం ఇంగ్లండ్(England) పర్యటనలో ఉన్న టీమిండియా.. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో ఆడుతుంది. ఇప్పటికే రెండు టెస్టులు అయిపోయాయి. ఇందులో తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టులో భారత(India)విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు లీడ్స్(Leads) వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఫిట్‌నెస్ విషయంలో టీమిండియాలో కోహ్లీ(Kohli) చాలా మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫిట్ ఫ్రీక్‌గా మారి టీమ్‌ను సైతం ఫిట్ ఇండియా(Fit India)గా మార్చాడు. ఆటగాళ్లు జట్టులోకి రావాలంటే పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలని, జట్టు ప్రమాణాలు అందుకోవాలనే కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News