Not Rohit Sharma or KL Rahul: రోహిత్ శర్మ కాదు.. కేఎల్ రాహుల్ కాదు! టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?!!

విరాట్ కోహ్లీ వారసుడిగా యువ క్రికెటర్‌ రిషబ్ పంత్ పేరును టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్ గవాస్కర్  సూచించారు. పంత్‌కే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని టైగర్‌ పటౌడీని ఉదహరించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 04:14 PM IST
  • టెస్టు కెప్టెన్సీ వదిలేసిన విరాట్ కోహ్లీ
  • రోహిత్ శర్మ కాదు.. కేఎల్ రాహుల్ కాదు
  • టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా
Not Rohit Sharma or KL Rahul: రోహిత్ శర్మ కాదు.. కేఎల్ రాహుల్ కాదు! టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?!!

Sunil Gavaskar feels Rishabh Pant to replace Virat Kohli as India's new Test captain: కొన్ని రోజులుగా కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్​గా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli).. శనివారం దానికి కూడా వీడ్కోలు (Test Captain) పలికిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగాడు. మూడు నెలల్లో అన్ని ఫార్మాట్ల సారథ్యంకు కోహ్లీ వీడ్కోలు పలకడం ఇప్పుడు పెద్ద సంచలంగా మారింది. పరిమిత ఓవర్లకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథిగా ఉండగా.. టెస్ట్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారన్న అంశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.

ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్‌ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది మాజీలు, అభిమానులు భావిస్తున్నారు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాత్రం వారితో ఏకీభవించడం లేదు. విరాట్ కోహ్లీ వారసుడిగా యువ క్రికెటర్‌ రిషబ్ పంత్ (Rishabh Pant) పేరును సన్నీ సూచించారు. పంత్‌కే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని టైగర్‌ పటౌడీని ఉదహరించారు. 24 ఏళ్ల పంత్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించి సక్సెస్ అయ్యాడు.

Also Read: Baahubali Thali Prize Money: ఈ బాహుబలి మీల్స్ తింటే.. రూ 8 లక్షల ప్రైజ్ మనీ మీ సొంతం!!

ఓ జాతీయ మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'టీమిండియా తదుపరి కెప్టెన్‌ (India's New Test Captain) ఎవరని అడిగితే.. నేను మాత్రం రిషబ్ పంత్‌ పేరే చెబుతా. రికీ పాంటింగ్‌ ముంబై ఇండియన్స్‌ సారథిగా తప్పుకున్నప్పుడు రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ అప్పగించారు. ఆ తర్వాత రోహిత్‌ బ్యాటింగ్‌ ఎలా మారిపోయిందో మనం చూశాం. కెప్టెన్‌గా బాధ్యతనను నెత్తికెత్తుకున్న తర్వాత 30, 40, 50లను సెంచరీలు, 150, 200లుగా మార్చాడు. పంత్‌ కూడా బాధ్యతలు స్వీకరిస్తే.. మరింత బాగా రాణించగలుగుతాడని నా అభిప్రాయం. న్యూలాండ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ చేశాడు' అని అన్నారు. 

'టైగర్‌ పటౌడీ 21 ఏళ్లకే టీమిండియా కెప్టెన్‌ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా రాణించారు. రిషబ్ పంత్‌ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది అనుకుంటున్నా. ఐపీఎల్‌ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అతడు ముందుండి నడిపించిన విధానం చూశాం. పంత్ శక్తిసామర్థ్యాలను ఇప్పటికే మనం గమనించాం. అదే తరహాలో అతడు భారత జట్టును ముందుకు నడిపిస్తాడని భావిస్తున్నా. అతడే బెస్ట్ చాయిస్' అని కామెంటేటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. 

Also Read: Virat Kohli Test Records: ఏ భారత కెప్టెన్‌లకు అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ.. తిరుగులేని టెస్ట్ రికార్డులు ఇవే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News