IAS Officer Cooking: స్టవ్‌ వెలిగించకుండా.. వంట చేసే సత్తా ఆ ఐఏఎస్‌ అధికారికి మాత్రమే ఉంది!!

ప్రస్తుతం కాన్పూర్ కమిషనర్‌గా పనిచేస్తున్న రాజ్ శేఖర్ ఆదివారం అల్పాహారం చేసారు. తన సతీమణి సూచనలు, సాయంతో ఐఏఎస్ అధికారి అయిన రాజ్ శేఖర్ అల్పాహారం పోహా తయారు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 07:03 PM IST
  • స్టవ్ ఆఫ్ అయింది సారూ.. ఓసారి చూసుకోండి
  • స్టవ్‌ వెలిగించకుండా.. వంట చేసే సత్తా ఆ ఐఏఎస్‌ అధికారికి మాత్రమే ఉంది
  • ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపినందుకు ధన్యవాదాలు
IAS Officer Cooking: స్టవ్‌ వెలిగించకుండా.. వంట చేసే సత్తా ఆ ఐఏఎస్‌ అధికారికి మాత్రమే ఉంది!!

 
Netizens trolls Kanpur IAS Officer over Cooking Poha: ఆ మధ్య ఓ ఐఏఎస్‌ అధికారి కూర‌గాయ‌లు అమ్మిన విషయం తెలిసిందే. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఐఏఎస్ అధికారి (IAS Officer) అఖిలేష్ మిశ్రా.. కూరగాయ‌లు అమ్ముతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. కూరగాయ‌లు కొనేందుకు వెళ్లగా బండి వద్ద ఉన్న మ‌హిళ కాసేపు త‌న వ్యాపారం చూసుకోవాలని కోరగా.. కాద‌న‌లేక‌ ఆ ఐఏఎస్ అధికారి అక్క‌డ వెజిటబుల్స్ అమ్మారు. తాజాగా మరో ఐఏఎస్ అధికారి ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అధికారి తన ఇంట్లో వంట చేస్తూ.. ట్రోల్స్ బారిన పడ్డారు. అసలు విషయంలోకి వెళితే.. 

ప్రస్తుతం కాన్పూర్ (Kanpur) కమిషనర్‌గా పనిచేస్తున్న రాజ్ శేఖర్ (Raj Shekhar) ఆదివారం అల్పాహారం చేసారు. తన సతీమణి సూచనలు, సాయంతో ఐఏఎస్ అధికారి అయిన రాజ్ శేఖర్ అల్పాహారం పోహా (Poha) తయారు చేశారు. అయితే వంటకం పూర్తయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి.. తాను తయారు చేసిన పోహాతో సెల్ఫీ దిగి త ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫొటోలో ఫార్మల్ సూట్, ఇయర్‌ ఫోన్‌లు ధరించి.. గరిటె పట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చారు. 'నాకు గుడ్ లక్ చెప్పండి. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. హోం మంత్రి మార్గదర్శకత్వంలో అల్పాహారం పోహాను సిద్ధం చేశాను' అని ట్వీట్ చేశారు. 

Also Read: Aakash Chopra: టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.. అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే: ఆకాశ్‌

ఐఏఎస్ అధికారి (IAS Officer) రాజ్ శేఖర్ పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు (Netizens) తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'స్టవ్ ఆఫ్ అయింది సారూ.. ఓసారి చూసుకోండి' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'స్టవ్‌ వెలిగించకుండా.. వంట చేసే సత్తా ఆ ఐఏఎస్‌ అధికారికి మాత్రమే ఉంది' అని మరొకరు ట్వీట్ చేశారు. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) కూడా సరదాగా స్పందించారు. 'వంట గ్యాస్‌ ధర రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలా వంట చేయవచ్చు అని ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని పంపినందుకు ధన్యవాదాలు సర్' అని ప్రియాంక చతుర్వేది సెటైర్లు వేశారు. 

Also Read: Peng Shuai: నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు.. యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News