Bhanuka Rajapaksa Retires: శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ఓ యువ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన భానుక రాజపక్సా.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. తాను క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు శ్రీలంక క్రికెట్ కు లేఖ రాశాడు.
అయితే దీనిపై శ్రీలంక క్రికెట్ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోగా.. తాను మాత్రం శ్రీలంక క్రికెట్ పెట్టే ఆంక్షల్ని భరించేందుకు సిద్ధంగా లేనని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక టీమ్ తరఫున 5 వన్డేలు, 18 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు.
మరోవైపు రాజపక్సా రిటైర్మెంట్ పై పలువురు సీనియర్ ఆటగాళ్లు స్పందించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. లంక మాజీ పేసర్ లసిత్ మలింగ కూడా ట్విట్టర్ వేదికగా రాజపక్సాకు సూచనలు చేశాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భానుక రాజపక్సాకు కోరాడు.
"అంతర్జాతీయ స్థాయిలో మీ దేశానికి ప్రాతినిథ్యం వహించడం అంత తేలికైన పని కాదు. ఆటగాళ్లు ఎప్పుడూ సవాళ్లను ఎదుర్కుంటారు. భానుక రాజపక్స ఇంకా శ్రీలంక క్రికెట్ కు చాలా సేవ చేయాల్సి ఉందని నేను భావిస్తున్నాను. రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించమని నేను కోరుతున్నాను" అని లసిత్ మలింగ ట్వీట్ చేశాడు.
శ్రీలంక క్రికెట్ ప్రవేశపెట్టిన నిబంధనలేమిటి?
శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల కోసం ఇటీవలే కొత్త ఫిట్నెస్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం.. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు 8.10 నిమిషాలలో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. ఒకవేళ 8.35 నిమిషాల నుంచి 8.55 నిమిషాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తితే ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఎంతమేర కోత విధిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.
దీంతోపాటు ప్రతి నెలా స్కిన్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది బాడీ ఫ్యాట్ ను కొలిచే ఓ పరీక్ష. ఒక పరికరం ద్వారా శరీరంలోని కొవ్వును కొలుస్తారు. స్కిన్ ఫోల్డ్ టెస్టులో 70-85 కంటే తక్కువ ఉన్నవారినే తుది జట్టులో ఉంచుతారు.
అయితే ఈ కొత్త నిబంధనలపై రాజపక్సా అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్కిన్ ఫోల్డ్ టెస్టు ద్వారా తన సహజ ఆట మీద ప్రభావం పడుతుందని అతడు ఆందోళన చెందుతున్నాడు. తాను ప్రత్యేకంగా ఆడే పవర్ హిట్టింగ్ మీద కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని రాజపక్సా వాపోయినట్లు తన సన్నిహితులు తెలిపారు.
Also Read: Rishabh Pant Record: రిషబ్ పంత్ అరుదైన రికార్డు.. నాలుగో భారత వికెట్ కీపర్‌గా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.