National Sports Award 2023: క్రీడా అవార్డులు ప్రకటన.. మహ్మద్ షమీకి అర్జున అవార్డు

Mohammed Shami Arjuna Award: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని అర్జున అవార్డు వరించింది. చిరాగ్ శెట్టి-సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జంట ఖేల్ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. జనవరి 9న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 20, 2023, 07:00 PM IST
National Sports Award 2023: క్రీడా అవార్డులు ప్రకటన.. మహ్మద్ షమీకి అర్జున అవార్డు

Mohammed Shami Arjuna Award: 2023కి గానూ జాతీయ క్రీడా అవార్డులను  క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. వరల్డ్ కప్‌లో టీమిండియా తరుఫున అద్భుత ప్రదర్శన చేయడంతో షమీకి అర్జున అవార్డు వరించింది. మొత్తం 26 క్రీడాకారులకు అవార్డులను ప్రకటించారు. ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌ చంద్ ఖేల్‌రత్న అవార్డుకు బ్యాడ్మింటన్ జంట చిరాగ్ శెట్టి-సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ఎంపికయ్యారు. సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో పురుషుల డబుల్స్‌లో ఈ జోడీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్, చైనా మాస్టర్స్ టైటిళ్లను కూడా ఈ జంట సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి 9న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో అన్ని జాతీయ క్రీడా అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు. కమిటీల సిఫార్సుల ఆధారంగా ఆటగాళ్లు, కోచ్‌లు, సంస్థలను అవార్డులకు ఎంపిక చేసినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థల జాబితాను విడుదల చేసింది.

అవార్డులకు ఎంపికైంది వీళ్లే..

==> ఖేల్‌రత్న అవార్డు- చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- బ్యాడ్మింటన్
 ==> అర్జున అవార్డు- 
 ==> ఓజస్ ప్రవీణ్ డియోటాలే-ఆర్చరీ
 ==> అదితి గోపీచంద్ స్వామి-ఆర్చరీ
 ==> శ్రీశంకర్-అథ్లెటిక్స్
 ==> పరుల్ చౌదరి-అథ్లెటిక్స్ 
 ==> మహ్మద్ హుసాముద్దీన్ -బాక్సర్
 ==> ఆర్.వైశాలి-చెస్ 
 ==> మహ్మద్ షమీ-క్రికెట్ 
 ==> అనూష్ అగర్వాల్-హర్స్ రైడింగ్
 ==> దివ్యకృతి సింగ్-హార్స్ రైడింగ్ 
 ==> గోత్‌క్షా బాగర్ డ్రస్సేజ్ చాను-హాకీ 
 ==> పవన్ కుమార్-కబడ్డీ 
 ==> రీతు నేగి-కబడ్డీ 
 ==> నస్రీన్- ఖోఖో 
 ==> పింకీ-లాన్ బాల్స్ 
 ==> ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్-షూటింగ్ 
 ==> ఇషా సింగ్-షూటింగ్ 
 ==> హరీందర్ పాల్ సింగ్-స్క్వాష్ 
 ==> ఐహికా ముఖర్జీ-టేబుల్ టెన్నిస్ 
 ==> సునీల్ కుమార్ -రెజ్లింగ్ 
 ==> దేవినా రొమాంటిక్-రెజ్లింగ్ అల్టిమేట్ 
 ==> ఉషు శీతల్ దేవి-పారా ఆర్చరీ 
 ==> అజయ్ కుమార్-బ్లైండ్ క్రికెట్ 
 ==> ప్రాచీ యాదవ్-పారా కానోయింగ్

 ద్రోణాచార్య అవార్డు 2023

 ==> లలిత్ కుమార్-రెజ్లింగ్ 
 ==> ఆర్‌బీ రమేష్-చెస్ 
 ==> మహావీర్ ప్రసాద్ సైనీ-పారా అథ్లెటిక్స్
 ==> శివేంద్ర సింగ్-హాకీ
 ==> గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్-మల్లాఖాంబ్

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News