టెస్టుల్లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న టీమిండియా..వన్డే, టి 20లోనూ ఆగ్రస్థానికి చేరువలోనే ఉంది..గత రెండేళ్ల నుంచి ఎదురుపడిన ప్రతీ జట్టును కోహ్లీసేన ఓడిస్తూ వస్తోంది. అయితే గత రెండేళ్లలో సొంతగడ్డపై కాకుండా విండీస్, శ్రీలంక లో మాత్రమే టీమిండియా పర్యటించింది. అయితే ఇప్పటి వరకు కఠిన సవాళ్లు విసిరే దేశంలో పర్యటించలేదు.
ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లనూ టెస్టుల్లో కోహ్లీసేన ఓడించింది కానీ.. అవన్నీ కూడా సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లే. అయితే ఇప్పుడు విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్న కోహ్లీసేనకు.. సౌతాఫ్రికా సిరీస్ సవాల్ విసరబోతోంది.
ఫాస్ట్ బౌలర్ల స్వర్గధామం సౌతాఫ్రిలో కోహ్లీసేన అగ్ని పరీక్ష ఎదుర్కోబోతోందనడం ఎలాంటి సందేహం లేదు. కఠిన సవాల్ విసరబోయే సౌతాఫ్రికా సిరీస్ లో గత ప్రదర్శన కొనసాగిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. తదుపరి కఠిన సిరీస్ ను నెగ్గేందుకు ఇదే తొలి అడుగు అవుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా సిరీస్ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సవాల్‌తో కూడిన సౌతాఫ్రికా సిరీస్