Kohli vs BCCI: ఈ వివాదానికి తెరపడాలంటే.. గంగూలీ, కోహ్లీ మీడియా ముందుకు వచ్చి ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి!

బీసీసీఐ, విరాట్ కోహ్లీ మాటలపై తాజాగా భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ చెప్పిన దానికి.. విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:33 PM IST
  • గంగూలీ, కోహ్లీ మీడియా ముందుకు రావాల్సిందే
  • వన్డే కెప్టెన్సీ వివాదంపై సునీల్‌ గావస్కర్‌ ఏమన్నాడంటే
  • ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి
 Kohli vs BCCI: ఈ వివాదానికి తెరపడాలంటే.. గంగూలీ, కోహ్లీ మీడియా ముందుకు వచ్చి ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి!

Sourav Ganguly, Virat Kohli explain reasons infront of Media: సుదీర్ఘ భారత క్రికెట్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అనుకోని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ (BCCI) బోర్డు వైఖరిని ఎండగడుతూ టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కౌంటర్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం బుధవారం బయల్దేరి వెళ్లడానికి ముందు కెప్టెన్‌ హోదాలో కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా, వన్డే నాయకత్వం నుంచి తొలగింపు, రోహిత్‌ శర్మ (Rohit Sharma) తో విభేదాలు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నుంచి విరామం, బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) వ్యాఖ్యలు లాంటి విషయాలపై పూర్తి స్పష్టత ఇచ్చాడు. 

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్న విషయం సెలెక్టర్ల సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే చెప్పారు అని విరాట్ కోహ్లీ తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటి నుంచి బోర్డు తనతో మాట్లాడలేదన్నాడు. టీ20 కెప్టెన్సీని వదిలేయమని తనకు ఎవరూ చెప్పడలేదని కూడా స్పష్టం కూడా చేశాడు. అయితే అంతకుముందు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని అభ్యర్థించినా విరాట్ తన మాట వినలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. గంగూలీని ఉద్దేశించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ మార్పుపై సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ కోహ్లీతో ముందుగానే చర్చించాడని పేర్కొంది. దాంతో బీసీసీఐ కోహ్లీలలో ఎవరు నిజం చెపుతున్నారో అర్ధం కాకుండా పోయింది. 

Also Read: Pragathi Dance: అమ్మో.. ప్రగతి మళ్లీ రచ్చచేసిందిగా! నాగిని డ్యాన్స్‌తో అందాల ఆరబోత మాములుగా లేదు!!

బీసీసీఐ, విరాట్ కోహ్లీ మాటలపై తాజాగా భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ చెప్పిన దానికి.. విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదన్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీపై వస్తున్న వధంతులపై స్పష్టత రావాలంటే.. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు. 'బీసీసీఐని ఈ వివాదంలోకి లాగాలని విరాట్ కోహ్లీ భావించి ఉండకపోవచ్చు. కానీ వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు' అని సన్నీ అన్నారు. 

Also Read: Jr NTR Dubbing: ఆర్ఆర్ఆర్ కోసం తొలిసారిగా హిందీలో డబ్బింగ్ చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్

ప్రస్తుతం సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన వ్యాఖ్యలపై అందరూ గందరగోళానికి గురవుతున్నారు. బీసీసీఐలో మొదలైన ఈ వివాదానికి తెరపడాలంటే.. గంగూలీ, కోహ్లీ మీడియా ముందుకు రావాలి. ఎక్కడ తప్పు జరిగిందో వారు వివరించాలి. సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ కూడా కోహ్లీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి. లేదా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించిన కారణాలను వివరిస్తూ.. సెలెక్షన్‌ కమిటీ పత్రికా ప్రకటన ఇచ్చినా సరిపోతుంది. అప్పుడే అనవసర ఊహాగానాలను అరికట్టగలం. వీలైనంత తొందరగా ఈ పని చేస్తే బాగుంటుంది' అని సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సూచించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News