David Warner Record: స్టంపౌటైన డేవిడ్ వార్నర్‌‌.. వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో ఆటగాడిగా రికార్డు!

David Warner becomes second batter to get stumped out on 99 in ODIs. వన్డే క్రికెట్‌ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్‌ ఔట్‌ అయిన రెండో ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. 

Written by - P Sampath Kumar | Last Updated : Jun 22, 2022, 05:15 PM IST
  • నాలుగో వన్డేలో శ్రీలంక విజయం
  • స్టంపౌటైన డేవిడ్ వార్నర్‌‌
  • వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో ఆటగాడిగా రికార్డు
David Warner Record: స్టంపౌటైన డేవిడ్ వార్నర్‌‌.. వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో ఆటగాడిగా రికార్డు!

David Warner becomes second batter to get stumped out on 99 in ODIs: శ్రీలంకతో మంగళవారం (జూన్‌ 21) జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లక్ష్య ఛేదనలో ఆసీస్‌ 50 ఓవర్లలో 254 పరుగులకు కుప్పకూలి విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను లంక 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో 1992 తర్వాత లంక స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.

ఈ మ్యాచులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 12 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేశాడు. ఒక్క పరుగు తేడాతో డేవిడ్ భాయ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఎంతో బాధ్యతాయుతంగా ఆడిన వార్నర్‌.. 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో స్టంప్‌ ఔటయ్యాడు. 38వ ఓవర్ రెండో బంతిని వార్నర్ క్రీజ్ నుంచి బయటికి వచ్చి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని ఆడలేకపోయాడు. అది కాస్తా వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా చేతుల్లో పడడంతో.. మెరుపు వేగంతో బెయిల్స్‌ను పడగొట్టాడు. 

నాలుగో వన్డేలో డేవిడ్‌ వార్నర్‌ స్టంపౌట్ కావడంతో అతడి ఖాతాలో ఓ రికార్డు చేరింది. వన్డే క్రికెట్‌ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్‌ ఔట్‌ అయిన రెండో ఆటగాడిగా వార్నర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. 2002లో నాగ్‌పూర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ 99 పరుగుల వద్ద స్టంప్‌ ఔటయ్యాడు. డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2022 నుంచి మంచి ఫామ్ కనబర్చుతున్న విషయం తెలిసిందే. అదే ఫామ్ లంక పర్యటనలోనూ కొనసాగిస్తున్నాడు. 

ఐదు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఓటమి తరువాత లంక గొప్పగా పుంజుకుని వరుసగా మూడింటినీ గెలిచింది. 2012 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక వరుసగా మూడు వన్డేల్లో గెలుపొందడం విశేషం. ఇక ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య చివరి మ్యాచ్‌ శుక్రవారం జరుగుతుంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీసును ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది.  

Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!

Also Read: Halharini Amavasya 2022: హలహరిణి అమావాస్య ఎప్పుడు? ఇది రైతులకు ఎందుకు ప్రత్యేకం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News