Shikhar Dhawan: జడేజా వద్ద శిఖర్ ధావన్ సరికొత్త స్టెప్పులు..వైరల్‌గా రీల్ వీడియో..!

Shikhar Dhawan: టీమిండియా వన్డే ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. యువ ఆటగాళ్లతో కలిసి అతడు చేసే అల్లరి అంత ఇంత కాదు. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. 

Written by - Alla Swamy | Last Updated : Sep 24, 2022, 04:39 PM IST
  • మరోసారి వార్తల్లో శిఖర్‌ ధావన్‌
  • వీడియో వైరల్
  • కామెంట్లు ఇస్తున్న నెటిజన్లు
Shikhar Dhawan: జడేజా వద్ద శిఖర్ ధావన్ సరికొత్త స్టెప్పులు..వైరల్‌గా రీల్ వీడియో..!

Shikhar Dhawan: గాయం కారణంగా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స పూర్తైంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో అతడిని టీమిండియా వన్డే ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ కలిశాడు. జడేజా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. అనంతరం అతడి వద్ద ధావన్ స్టెప్పులు వేశాడు. జడేజా సైతం ఇందుకు తాళం అందించాడు. బాలీవుడ్ డైలాగ్‌కు లిప్‌ సింక్ చేస్తూ కనిపించాడు.

ఈవీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్ షేర్ చేశాడు. జడేజాతో కలిసి ధావన్ చేసిన రీల్ వైరల్‌ మారింది. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. దీనితోపాటు కామెంట్లు చేస్తున్నారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈవీడియోలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. అతడికి త్వరగా పెళ్లి చేయాలి..ఒక్కసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దారిలోకి వస్తాడని ధావన్‌ను ఉద్దేశించి జడేజా కామెంట్ చేశాడు.

ఐనా డ్యాన్స్‌ను ధావన్‌ ఆపని దృశ్యాలు కనిపించాయి. దీనికి కాదు కాదు..ఇప్పుడు కాదు..కొంచెం ఆగండి అని ధావన్ సరదాగా అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈవీడియోపై టీమిండియా యువ ప్లేయర్ ఖలీల్ అహ్మద్, అర్ష్‌ దీప్ స్పందించారు. తన దైన శైలిలో కామెంట్స్ ఇచ్చారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

Also read:Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ ఆఫర్లు, ఐఫోన్‌పై ఎయిర్‌పాడ్స్ ఉచితం

Also read:IND vs AUS: నాగ్‌పూర్‌ టీ20లో దినేష్‌ కార్తీక్ ఫినిషింగ్ షాట్..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News