Shardul Thakur's engagement pics: శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

Shardul Thakur, Mittali Parulkar's engagement pics: టీమిండియా ఆల్ రౌండర్ శార్థుల్ ఠాకూర్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ మిట్టలి పరుల్కర్‌తో శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ముంబైలో నిన్న సోమవారం ఈ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ జరిగింది. టీమిండియా టీ20 జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 07:31 PM IST
  • గాళ్ ఫ్రెండ్ పరుల్కర్‌తో శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్
  • తన నిశ్చితార్థం వేడుక ఫోటోలు షేర్ చేసుకున్న శార్థుల్ ఠాకూర్
  • శార్థుల్ ఠాకూర్‌కి శుభాకాంక్షలు తెలిపిన తోటి క్రికెటర్స్
Shardul Thakur's engagement pics: శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

Shardul Thakur, Mittali Parulkar's engagement pics: టీమిండియా ఆల్ రౌండర్ శార్థుల్ ఠాకూర్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ మిట్టలి పరుల్కర్‌తో శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ముంబైలో నిన్న సోమవారం ఈ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ జరిగింది. టీమిండియా టీ20 జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధీనంలో ఉన్న ఓ ప్రత్యేక స్థలం శార్థుల్ ఠాకూర్, పరుల్కర్ ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్‌కి వేదికైంది. డొమెస్టిక్ క్రికెట్‌లో శార్థుల్ ఠాకూర్ ముంబై నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Also read : Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?

శార్థుల్ ఠాకూర్ తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలను (Shardul Thakur engagement photos) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, విజయ్ శంకర్, శామ్ కుర్రాన్‌తో పాటు ఇతర క్రికెటర్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ తమదైన స్టైల్లో విష్ చేశారు. 

శార్థుల్ ఠాకూర్ నిశ్చితార్థం వేడుకకు హాజరైన రోహిత్ శర్మ (Rohit Sharma) ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. నూతన ఆరంభానికి కంగ్రాట్స్ బ్రో అని ట్వీట్ చేశాడు.

Also read : Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే

టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ (Wasim Jaffer) సైతం తనదైన స్టైల్లో శార్థుల్ ఠాకూర్‌ని విష్ చేశాడు. అదేంటో మీరే చూడండి. 

Also read : Sirivennela Seetharama Sastry: అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో నిలిచిపోతాయి: జగన్

శార్థుల్ ఠాకూర్ కెరీర్లో ఇప్పటివరకు ఇండియా తరపున 4 టెస్టు మ్యాచులు, 15 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచులు, 22 టీ20 మ్యాచులు ఆడాడు. 2018లో శార్థుల్ ఠాకూర్ టెస్ట్ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోనూ శార్థుల్ ఠాకూర్ (Shardul Thakur) పాల్గొన్నాడు. కాకపోతే ఈ టీ20 ప్రపంచ కప్‌లో శార్థుల్‌కి రెండు మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది.

Also read : Samantha Item Song Pushpa: ‘పుష్ప’ ఐటెం సాంగ్ లో సమంత ఫిక్స్.. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News