Sania Mirza Retirement: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనుంది. ఈ టోర్నమెంట్ వచ్చే నెలలో దుబాయ్‌లో జరుగనుంది. భారత్ టెన్నిస్‌లో అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలిచింది సానియా మీర్జా. ఆరు గ్రాండ్‌స్లామ్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె భారత్ తరఫున టెన్నిస్ ఆడింది.
సానియా మీర్జా గతేడాది యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే గాయం కారణంగా ఆమె టోర్నమెంట్‌లో ఆడలేకపోయింది. ఆ తర్వాత ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంది. సానియా మీర్జా గత పదేళ్లుగా సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. దుబాయ్‌లో సానియా మీర్జాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సానియా మీర్జా అభిమానుల మధ్య టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది.
ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరగనున్న డబ్యూటీఏ 1000 టోర్నమెంట్ తరువాత రిటైర్మెమెంట్ అవుతున్నట్లు సానియ మీర్జా తెలిపింది. తాను గాయం కారణం తప్పుకోవాలని అనుకోవట్లేదని.. తన ఇష్ట ప్రకారమే గుడ్ బై చెబుతున్నానని చెప్పింది. ఎమోషనల్‌గా ముందుకు వెళ్లే శక్తి తన మనసుకు లేదని పేర్కొంది. తాను 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టానని.. ప్రాధాన్యతలు మారుతున్నాయంది. రిటైర్మెంట్ తర్వాత దుబాయ్‌లోని తన అకాడమీపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు భారత స్టార్ తెలిపింది.
సానియా మీర్జాకు అందుకున్న అవార్డులు
➤ 2004: అర్జున అవార్డు
➤ 2006: పద్మశ్రీ అవార్డు
➤ 2015 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
➤ 2016: పద్మ భూషణ్ అవార్డు
సానియా మీర్జా 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. ఓ పాకిస్థానీని పెళ్లి చేసుకున్నందుకు అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చియి. వీరిద్దరికీ ఒక కొడుకు ఇజాన్ మీర్జా మాలికా కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని నెలలుగా సానియా, షోయబ్ మాలిక్ విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఇద్దరు వీడిపోతున్నారంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది. అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. వసతి గదుల అద్దె భారీగా పెంపు
Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Sania Mirza: రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ప్రకటన.. లాస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఫిబ్రవరిలో టెన్నిస్‌కు సానియా వీడ్కోలు
ఇష్ట ప్రకారమే గుడ్ బై
రిటైర్మెంట్ తరువాత ప్లానింగ్ ఇదే..