Saina Accepted Siddharth Apology: క్షమాపణలు కోరిన హీరో సిద్దార్థ్.. అంగీకరించిన సైనా

తీవ్ర దుమారం లేపిన సైనా నెహ్వాల్ - సిద్దార్థ్ ట్విట్టర్ వార్ ఇక ముగిసింది. ట్విట్టర్ వేదికగా సిద్దార్థ్ క్షమాపణలు కోరటం, సైనా నెహ్వాల్ అంగీకరించడంతో ఇక ఈ వివాదానికి తెరపడినట్లయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 12:22 PM IST
  • దుమారం రేపిన సిద్దార్థ్ - సైనా ట్విట్టర్ వార్ ముగింపు
  • ట్విట్టర్ వేదికగా క్షమాపణ కోరిన హీరో సిద్దార్థ్
  • సిద్దార్థ్ క్షమాపణలను అంగీకరించిన సైనా నెహ్వాల్‌
Saina Accepted Siddharth Apology: క్షమాపణలు కోరిన హీరో సిద్దార్థ్.. అంగీకరించిన సైనా

 Saina Nehwal reaction on actor Siddharth apologize: భారత బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) పై హీరో సిద్దార్థ్ చేసిన (Actor Siddharth) వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ వివాదం ఎలా ప్రారంభమైందంటే.. 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో (PM Narendra Modi Punjab Rally) భద్రతా వైఫల్యం కారణంగా మోదీ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సైనా నెహ్వాల్... "దేశంలో ప్రధానికే భద్రత కరువైతే.. మన దేశాన్ని ఎవరు కాపాడతారంటూ ప్రశ్నించించారు.. "

అయితే దీనికి గాను.. హీరో సిద్దార్థ్ సైనా నెహ్వాల్ ను కించపరుస్తూ.. 'సబ్టిల్ కాక్ వరల్డ్ ఛాంపియన్... థాంక్ గాడ్.. దేశాన్ని రక్షించేవారు ఉన్నారు...' అంటూ స్పందించిన ఘటన తీవ్ర దుమారం లేపింది. హీరో సిద్దార్థ్ 'కాక్' అనే పదాన్ని వాడి మహిళల అందరిని కించపరిచాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. వీటితో పాటుగా జాతీయ మహిళా కమీషన్ కూడా హీరో సిద్దార్థ్ కు నోటీసులు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా.. హీరో సిద్దార్థ్ కాస్త వెనక్కి తగ్గి.. సైనా నెహ్వాల్ కు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. సిద్దార్థ్ వివరణ ఇస్తూ.. 'కొద్దీ రోజుల క్రితం నేను వేసిన జోక్ కి చాలా విమర్శలు వచ్చాయి.. నేను వేసిన ఒక జోక్ కి వివరణ ఇవ్వాల్సి వస్తుంది అంటే అది మంచి జోక్ కాదని అర్థం.. అందరిని ఇబ్బంది పెట్టే జోక్ వేసినందుకు క్షమాపణలు" అని చెప్పుకొచ్చాడు.  

ఇండియా ఓపెన్ 2022 (India Open 2022) పోటీల్లో రెండో రౌండ్‌లోకి చేరిన సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. సిద్దార్థ్ చెప్పిన క్షమాపణ గురించి చర్చించారు. సైనా మీడియాతో మాట్లాడుతూ " నటుడు సిద్ధార్థ్ మొదట నా గురించి ఎదో మాట్లాడారు.. మళ్లీ క్షమాపణలు కూడా చెప్పాడు.. అసలు ఈ విషయం ఎందుకు వైరల్ అయిందో కూడా నాకు తెలియదు. ట్విట్టర్‌లో నేను ట్రెండ్ అవ్వటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషంగా ఉంది" అంటూ సైనా నెహ్వాల్ తెలిపారు.. 

ఈ వివాదంలో హీరో సిద్దార్థ్ చివరగా క్షమాపణలు కోరటం.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ క్షమించటంతో ఈ వివాదం ఇక్కడితో తెరపడింది. 

Also Read: Pushpa Craze: కేరళ ఆలయంలో మారుమోగిన పుష్ప సాంగ్.. వీడియో వైరల్

Also Read: IND Vs SA 3rd Test: టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. సచిన్ సరసన విరాట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News