Sachin Tendulkar named his best playing XI of the IPL 2022: క్రికెట్ అభిమానులను రెండు నెలలుగా అలరించిన ఐపీఎల్ 2022 రెండు రోజుల క్రితం ముగిసిన విషయం తెలిసిందే. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవగా.. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 15వ సీజన్‌లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్ వెల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో వంటి స్టార్ ప్లేయర్లు అంతగా రాణించలేదు. తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్ లాంటి యువ ఆటగాళ్లు సత్తాచాటారు. ఐపీఎల్ 2022లో తన బెస్ట్ ఎలెవన్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు.
ఆటగాళ్ల పేరు లేదా వారి గత ప్రదర్శనల ఆధారంగా జట్టును ఎంపిక చేయలేదని, ఐపీఎల్ 2022లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంచుకున్నానని తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో పేర్కొన్నాడు. సచిన్ తన జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో హార్దిక్ అత్యుత్తమ కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఓపెనర్లుగా జోస్ బట్లర్, శిఖర్ ధావన్‌లను ఎంపిక చేశాడు. ఎడమ-కుడి కలయిక బాగుంటుందన్నాడు. బట్లర్ 863 పరుగులు చేయగా.. ధావన్ 460 రన్స్ చేశాడు.
కేఎల్ రాహుల్‌ను మూడో స్థానంలో సచిన్ ఎంచుకున్నాడు. బట్లర్ 15 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలతో సహా 616 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యాను నాలుగో స్థానం కోసం ఎంచుకున్నాడు. ఐదు, ఆరు స్థానాల్లో హిట్టర్లు డేవిడ్ మిల్లర్, లియమ్ లివింగ్ స్టోన్‌కు చోటు దక్కింది. ఇక 7వ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు దక్కింది. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రషీద్ ఖాన్‌కి చోటు దక్కింది. బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్‌ను సచిన్ ఎంపిక చేశాడు.
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ టీమ్:
జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్.
Also Read: ఐపీఎల్ టీమ్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్.. గుజరాత్ నుంచి నలుగురికి చోటు! కెప్టెన్ ఎవరంటే
Also Read: Theft in KVP House: కాంగ్రెస్ నేత కేవీపీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ... పోలీసులకు ఫిర్యాదు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook