RR vs KKR: చహల్ మాయ.. ఒబెడ్ మెక్కాయ్ సూపర్ బౌలింగ్! ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం!

Rajasthan Royals beat Kolkata Knight Riders. ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 12:00 AM IST
  • జోస్‌ బట్లర్‌ సెంచరీ
  • ఒబెడ్ మెక్కాయ్ సూపర్ బౌలింగ్
  • ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
RR vs KKR: చహల్ మాయ.. ఒబెడ్ మెక్కాయ్ సూపర్ బౌలింగ్! ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం!

Rajasthan Royals beat Kolkata Knight Riders: ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచులో సంజు శాంసన్ సేన 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 218 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ (85; 51 బంతుల్లో 7x4, 4x6), ఆరోన్ ఫించ్ (58; 28 బంతుల్లో 9x4, 2x6) టాప్ స్కోరర్లు. హ్యాట్రిక్ తీసిన యుజ్వేంద్ర చహల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 

భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు ఇన్నింగ్స్ ఆరంభంలో షాక్ తగిలింది. తొలి బంతికే సునీల్ నరైన్ (0) రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఇద్దరు బౌండరీలు బాదుతూ.. కోల్‌కతాను విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే ఫించ్, నితీష్ రాణా (18) అవుటైన తర్వాత కేకేఆర్ కష్టాల్లో పడింది. భారీ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (0) తొలి బంతికే డక్‌గా వెనుతిరిగాడు. 

ఆ తర్వాత 17వ ఓవర్లో యుజ్వేంద్ర చహల్ కోల్‌కతా విజయావకాశాలను దెబ్బతీశాడు. హ్యాట్రిక్ సహా మొత్తం నాలుగు వికెట్లు తీసిన చహల్.. కీలకమైన శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో రాజస్థాన్‌ జట్టు మళ్లీ పోటీలోకి వచ్చింది. అయితే 18వ ఓవర్లో ఉమేష్ యాదవ్ రెచ్చిపోవడంతో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో కేకేఆర్ రేసులోకి వచ్చింది. చివరి ఓవర్ వేసిన మెక్‌కాయ్.. షెల్డాన్ జాక్సన్ (8), ఉమేష్ యాదవ్ (21)ను అవుట్ చేసి థన్ ఆజట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతాకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం విశేషం. 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (103; 61 బంతుల్లో 9x4, 5x6) సెంచరీతో కదం తొక్కాడు. దేవదత్ పడిక్కల్ (24), సంజు శాంసన్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. షిమ్రాన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శివం మావి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ తీశారు. 

ALso Read: Buttler-Padikkal: ఏమా పరుగు.. ఒక బంతికి నాలుగు పరుగులు తీసిన బట్లర్, పడిక్కల్!

Also Read: RR vs KKR: ఒబెడ్ మెక్కాయ్ సూపర్ బౌలింగ్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News