Du Plessis: సుదీర్ఘకాలం తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. విరాట్ కోహ్లీ సారధ్యం లేకుండా ఆర్సీబీ ఐపీఎల్ 2022లో బరిలో దిగనుంది. మరి కొత్త కెప్టెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సుదీర్ఘ కాలం ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనసాగింది. ఈసారి అంటే ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ సారధ్యం లేకుండా ఆర్సీబీ జట్టు ఐపీఎల్ బరిలో దిగుతోంది. ఇప్పటికే మెగా ఆక్షన్ పూర్తి కావడంతో ఆర్సీబీ జట్టు సిద్ధమైంది. హాజెల్‌వుడ్ , డు ప్లెసిస్ వంటి కీలక ఆటగాళ్లను కొత్తగా చేర్చుకుని ఐపీఎల్ 2022 కోసం ఎదురుచూస్తోంది.
ఆర్సీబీ జట్టులో ఎవరి ధర ఎంత
విరాట్ కోహ్లీ 15 కోట్లు రిటైన్ కాగా, మ్యాక్స్‌వెల్ 11 కోట్లు, హర్షల్ పటేల్ 10 కోట్ల 75 లక్షలు, హసరంగ 10 కోట్ల 75 లక్షలు, హాజెల్‌వుడ్ 7 కోట్ల 75 లక్షలు, సిరాజ్ 7 కోట్లు, దినేశ్ కార్తీక్ 5 కోట్ల 50 లక్షలు, అనూజ్ రావత్ 3 కోట్ల 40 లక్షలు, రూథర్ ఫోర్డ్ కోటి రూపాయలు, మహిపాల్ లామ్రోర్ 95 లక్షలకు, ఫిన్ అలెన్ 80 లక్షలు, బెహ్రెండార్ఫ్ 75 లక్షలు, కరణ్ శర్మ 50 లక్షలు, సుయశ్ ప్రభుదేశాయ్ 30 లక్షలు, సీవీ మిలింద్ 25 లక్షలు, ఆకాశ్ దీప్ 20 లక్షలు, అనీశ్వర్ గౌతమ్ 20 లక్షల రూపాయల ధర పలికారు. డుప్లెసిస్‌ను మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పోటీ పడి మరీ 7 కోట్లకు దక్కించుకుంది.
ఇక ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ( Royal Challengers Bengaluru) కొత్త కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల్నించి తప్పుకోవడంతో ఏపీ డీవిలియర్స్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. అయితే అతడు అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ నుంచి తప్పుకోవడంతో మరొకర్ని కెప్టెన్‌గా ఎంచుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాక్స్‌వెల్ కెప్టెన్ గా అర్హతలు కలిగినా..ఆర్సీబీ జట్టు మాత్రం డు ప్లెసిస్ వైపు మొగ్గు చూపిస్తోంది. అందుకే సీఎస్కే జట్టుతో పోటీ పడి దక్కించుకుంది. మ్యాక్స్‌వెల్ ఎంతవరకూ జట్టుకు అందుబాటులో ఉంటాడనేది సందేహంగా ఉంది. ఎందుకంటే త్వరలో పెళ్లి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అతను దూరం కానున్నాడు. ఈ క్రమంలో డు ప్లెసిస్ సరైన ప్రత్యామ్నాయంగా ఆర్సీబీ భావిస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన డు ప్లెసిస్( Du Plessis)..ఆర్సీబీ కెప్టెన్‌గా దాదాపు ఖరారైనట్టే. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలినట్టు తెలుస్తోంది.
Also read: Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో సురేష్ రైనా అమ్ముడుకాకపోవడానికి కారణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook