Rohit Sharma: టీ20 ఫార్మాట్‌పై రోహిత్ శర్మ క్లారిటీ.. రిటైర్మెంట్‌పై ఏమన్నాడంటే..

Rohit Sharma On His T20 Career: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ.. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా తన టీ20 కెరీర్‌పై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2023, 08:06 PM IST
Rohit Sharma: టీ20 ఫార్మాట్‌పై రోహిత్ శర్మ క్లారిటీ.. రిటైర్మెంట్‌పై ఏమన్నాడంటే..

Rohit Sharma On His T20 Career: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన టీ20 కెరీర్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఇక టీ20ల్లో హిట్‌మ్యాన్‌ చూడటం కష్టమేని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీ20 టీమ్‌లో తాను భాగమవుతానా లేదా అని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ తన టీ20 కెరీర్ గురించి సమాధానమిస్తూ.. తాను ఇంకా టీ20 ఫార్మాట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకోలేదన్నాడు. నిరంతరంగా మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని అన్నాడు. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి అవసరం అని.. తన విషయంలోనూ అదే జరిగిందన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని.. ఐపీఎల్‌ తర్వాత ఈ విషయంలో ఆలోచిస్తానని అన్నాడు. 

రేపటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కావడంతో శ్రీలంక టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో ఓటమి తరువాత రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మాజీలు సూచించారు. బీసీసీఐ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు హింట్ ఇచ్చింది. ముందుగా న్యూజిలాండ్ టూర్‌కు రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. ఆ తరువాత బంగ్లా టూర్‌లో సీనియర్లు ఆడినా.. మళ్లీ శ్రీలంకతో టీ20 సిరీస్‌కు పక్కనపెట్టింది. త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

రోహిత్ శర్మ ఇప్పటివరకు టీమిండియా తరపున 148 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 30.82 సగటుతో 3853 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు కూడా అతనే. 2024లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ జట్టును సిద్ధం చేయాలని బోర్డు భావిస్తోంది. అందుకే టీ20ల నుంచి సీనియర్లకు విశ్రాంతి ఇస్తోంది. సీనియర్లను ఈ ఏడాది వరల్డ్ కప్‌కు సంసిద్ధం చేస్తోంది.   

Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!  

Also Read: Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News