Virat Kohli Record: విరాట్ కోహ్లీ రేర్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

RCB vs GT, IPL 2022: Virat Kohli Records. గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఆర్‌సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 03:53 PM IST
  • విరాట్ కోహ్లీ రేర్ రికార్డు
  • ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'
  • ఛాంపియన్స్‌ లీగ్‌లో 424 పరుగులు
Virat Kohli Record: విరాట్ కోహ్లీ రేర్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

RCB vs GT, IPL 2022: Virat Kohli becomes first batter to hit 300 plus runs in 13 IPLs: ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సూపర్ నాక్ ఆడాడు. గురువారం రాత్రి ముంబైలోని వాంఖడే మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (73; 54 బంతుల్లో 8x4, 2x6) హాఫ్ సెంచరీ బాదాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్‌లో కనిపించిన విరాట్.. మునుపటి కోహ్లీని తలపించాడు. 

గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఆర్‌సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో.. అత్యధిక సార్లు వరుసగా ప్రతీ సీజన్‌లో 300 పరుగులకు పైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు కోహ్లీ 14 మ్యాచులు ఆడగా.. 309 పరుగులు చేశాడు. దాంతో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా పేరుపై ఉన్నరికార్డును బ్రేక్ చేశాడు. రైనా, ధావన్ చెరో 12 సార్లు ఈ ఘనతను అందుకోగా.. కోహ్లీ 13 సార్లు 300కు పైగా పరుగులు బాదాడు. 

ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ మరో రికార్డును కూడా తన పేరుపై లికించుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు.. కోహ్లీ బెంగళూరు తరపున ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 235 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా కూడా మరో రికార్డును అందుకున్నాడు. 2008లో ఆర్‌సీబీలో చేరిన కోహ్లీ.. అప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో 6592 పరుగులు చేయగా.. ఛాంపియన్స్‌ లీగ్‌లో 424 పరుగులు బాదాడు. 

ఐపీఎల్ 2022లో ఒకే జట్టుపై రెండు హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచాడు. 15వ సీజన్లో భాగంగా గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 58 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 73 రన్స్ బాదాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. 2016లో కూడా గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో 100 పరుగులు బాదిన కోహ్లీ..  రెండో మ్యాచ్‌లో 109 రన్స్ చేశాడు. ఆ సీజన్‌లో బెంగళూరు ఫైనల్ వెళ్లి ఓడిపోయింది. 

Also Read: Disha Case: సిర్పుర్కర్ కమిషన్‌ నివేదిక తేటతెల్లం..పోలీసుల గుండెల్లో రైళ్లు..!

Also Read: Supreme Court:దిశా కేసును ప్రత్యేకంగా మానిటర్ చేయలేదు..సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News