Ravichandran Ashwin: హర్భజన్ రికార్డు బద్దలు.. మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి అశ్విన్! ముత్తయ్య తర్వాత అత్యంత వేగంగా!!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. భారత్, న్యూజీలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఓ రికార్డు నెలకొల్పాడు. ఐదో రోజు ఆటలో కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 04:53 PM IST
  • హర్భజన్ సింగ్ రికార్డు బద్దలు
  • మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి అశ్విన్
  • ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యంత వేగంగా
Ravichandran Ashwin: హర్భజన్ రికార్డు బద్దలు.. మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి అశ్విన్! ముత్తయ్య తర్వాత అత్యంత వేగంగా!!

Ravichandran Ashwin became India's 3rd highest wicket taker in Tests: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్‌ (India vs New Zealand) జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండ‌వ ఇన్నింగ్స్‌లో 284 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌.. అయిదో రోజు ఆట ముగిసేసరికి 165/9 స్కోరుతో నిలిచింది. ఈ మ్యాచులో బ్యాట్, బంతితో రాణించిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఓ రికార్డు నెలకొల్పాడు. ఐదో రోజు ఆటలో కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ (Tom Latham)ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (Highest wickets in Tests) పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ (414)ను అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్.. రెండో మరో మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) రికార్డును కూడా అధిగమించాడు. తొలి టెస్ట్‌కు ముందు సుదీర్ఘ ఫార్మాట్‌లో హర్భజన్‌ను (417)ను అధిగమించడానికి అశ్విన్‌కు ఐదు వికెట్లు అవసరం అయ్యాయి. ఐదో రోజు ఆటలో టామ్ లాథమ్‌ను ఔట్ చేయడం ద్వారా యాష్ ఖాతాలో ఆరో వికెట్ చేరింది. దాంతో హర్భజన్‌ను అధిగమించి భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా (India's 3rd highest wicket taker in Tests) రికార్డుల్లోకి ఎక్కాడు. 

Also Read: Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా మార్కెట్లకు లాభాలు- ఆదరగొట్టిన ఐటీ షేర్లు

రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 80 టెస్టుల్లో 418 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే (Anil Kumble 619 వికెట్లు), మాజీ సారథి కపిల్‌దేవ్ (Kapil Dev 434 వికెట్లు) అశ్విన్ కంటే ముందున్నారు. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (Muttiah Muralitharan 800) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ (Shane Warne) 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్‌ (632) మూడో స్థానంలో ఉన్నాడు. 619 వికెట్లతో అనిల్ కుంబ్లే నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 563 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

Also Read: Viral Video: పెళ్లాం కొట్టిందని పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన భర్త

అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఐదో ఆసియా బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) మరో రికార్డు నెలకొల్పాడు. ముత్తయ్య మురళీధరన్ 800 టెస్టు వికెట్లతో టాప్‌లో ఉండగా.. అనిల్ కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434), రంగనా హేరాత్ (433) అశ్విన్ కంటే ముందున్నారు. 80 టెస్టుల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా యాష్ రికార్డు క్రియేట్ చేశాడు. మురళీధరన్ 80 టెస్టుల తర్వాత 450 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 418 వికెట్లు తీశాడు. రిచర్డ్ హార్డ్‌లే 403, డేల్ స్టెయిన్ 402 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టామ్ లాథమ్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన భారత బౌలర్‌గా కూడా యాష్ నిలిచాడు. స్టువర్ట్ బ్రాడ్ 8 సార్లు అవుట్ చేశాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News