Ravi Kumar Dahiya : కామన్‌వెల్త్ గేమ్స్‌లో రవి కుమార్ దహియాకు గోల్డ్ మెడల్, పూజా గెహ్లాట్‌కి కాంస్య పథకం

Ravi Kumar Dahiya wins Gold Medal: కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాడు. అవును, కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ను మరో గోల్డ్ మెడల్ వరించింది.

Written by - Pavan | Last Updated : Aug 6, 2022, 11:33 PM IST
  • కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా భారత్‌కు గోల్డ్ మెడల్
  • నైజీరియా రెజ్లర్‌ని మట్టికరిపించిన రవి కుమార్ దహియా
  • పూజా గెహ్లాట్‌కి కాంస్య పథకం
Ravi Kumar Dahiya : కామన్‌వెల్త్ గేమ్స్‌లో రవి కుమార్ దహియాకు గోల్డ్ మెడల్, పూజా గెహ్లాట్‌కి కాంస్య పథకం

Ravi Kumar Dahiya wins Gold Medal: కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌లో రవి కుమార్ దహియా భారత్‌కు గోల్డ్ మెడల్ అందించాడు. అవును, కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ను మరో గోల్డ్ మెడల్ వరించింది. మెన్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో రవికుమార్ దహియా స్వర్ణ పథకం సొంతం చేసుకున్నాడు. నైజీరియాకు చెందిన ఎబైక్ వెనిమో వెల్సన్‌ని మట్టికరిపించడం ద్వారా రవి కుమార్ దహియా ఈ గోల్డ్ మెడల్ సాధించాడు. తొలుత నైజీరియా రెజ్లర్ వెల్సన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న రవి కుమార్ ఆ తర్వాత టెక్నికల్ సుపిరియారిటీతో అతడిపై పైచేయి సాధించాడు.

Pooja-Gehlot-wins-bronze-in-the-Womens-Freestyle-50-kg-at-Commonwealth-Games.jpg

ఇదిలావుంటే, బర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న ఇదే కామన్‌వెల్త్ గేమ్స్‌ వేదికపై మహిళల విభాగంలో 50 కేజీల కేటగిరీ రెజ్లింగ్‌లో పూజా గెహ్లాట్ కాంస్య పథకం గెలుచుకున్నారు. స్కాట్లాండ్‌కి చెందిన క్రిస్టిల్ లెచిడిజియోపై 12-2 తేడాతో గెలిచి భారత్‌కి మరో కాంస్య పథకం అందించారు.

Also Read : CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!

Also Read : IND vs WI 4th T20: రోహిత్‌ శర్మ ఫిట్.. శ్రేయాస్ అయ్యర్ ఔట్! డ్రీమ్ 11 టీమ్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News