రషీద్ ఖాన్‌ని ప్రశంసల్లో ముంచెత్తిన డేవిడ్ వార్నర్

రషీద్ ఖాన్ ఆటకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ ఫిదా 

Last Updated : May 27, 2018, 05:12 PM IST
రషీద్ ఖాన్‌ని ప్రశంసల్లో ముంచెత్తిన డేవిడ్ వార్నర్

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రేపు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. అయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2వ క్వాలిఫయర్ మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకు చేరడం వెనుక మాత్రం ఒక ఆటగాడి అద్భుతమైన ప్రతిభ వుంది. అతడే రషీద్ ఖాన్! అతడి ఆటే ఆ జట్టును 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిపించి ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ ప్రియులు రషీద్‌ని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో వన్‌ మ్యాన్‌ షోతో అదరగొట్టిన రషీద్‌ ఖాన్‌ ఇప్పుడు అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. 

 

 

Not much more needs to be said, #freak what a game bat and ball. So proud of this young man. Into the finals now for @sunrisershyd and can’t wait to see the boys out there in the final. Gonna be a great game. @rashid.khan19 #orangearmy

A post shared by David Warner (@davidwarner31) on

రషీద్ ఖాన్ ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు మాజీ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ సైతం ఆట చూసి ఫిదా అయ్యాడు. ఎంత ఫిదా అయ్యాడంటే.. తన ఇన్‌స్టాగ్రామ్ లో రషీద్ ఖాన్ ని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఓ పోస్ట్ పెట్టిన డేవిడ్ వార్నర్.. ఈ యువ సంచలనాన్ని చూస్తోంటే గర్వంగా ఉంది అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఉద్దేశిస్తూ.. "మనం ఫైనల్స్‌కి వచ్చేశాం. జట్టు ఫైనల్స్‌ ఆడుతుండగా చూడాలని వుంది. అదొక గొప్ప అనుభూతిని ఇవ్వాలని ఆశిస్తున్నా" అంటూ ఆ పోస్టులో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.  

Trending News