ఐపిఎల్ 2020లో ( IPL 2020 ) మ్యాచులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సగం లీగ్ జరగడానికి ముందే ఎన్నో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. చాలా మ్యాచులు చివరి బాల్ వరకు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ ( Rajasthan Royals ) మధ్య జరిగిన మ్యాచు కూడా థ్రిల్లర్ మూవీకన్నా తక్కువేం కాదు అన్నట్టుగా సాగింది. చివరికి రాజస్తాన్ రాయల్స్ టీమ్ 5 వికెట్లతో గెలుపు సాధించింది.
ALSO READ | RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో
రాజస్తాన్ జట్టులో రియాన్ పరాగ్ 26 బంతుల్లో 42 పరుగులు చేశాడు.ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. రాహుల్ తెవాటియా 28 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి రాజస్తాన్ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టాప్ ఆర్డర్ అంతగా రాణించకపోయినా చివరికి వరకు పోరాడి విజయం సాధించారు.
ఈ యువ ఆటగాళ్ల వల్ల రాజస్తాన్ టీమ్ 159 పరుగుల టార్గెట్ రీచ్ అవ్వగలిగింది. అయితే ఈ మ్యాచులో సన్‌రైజర్స్ ( SRH ) బౌలర్లు తమ ప్రయత్నంగా మ్యాచును తమవైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ తుపానులా విరుచుకుపడిన పరాగ్, తెవాటియా ముందు వారి గేమ్ ప్లాన్ పని చేయలేదు.
తొలూత బ్యాటింగ్ చేయానికి నిర్ణయించుకున్న సన్‌రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించింది. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మనీశ్ పాండే 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 44 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్ 2 సిక్సర్లు 3 ఫోర్లతో 38 బంతుల్లో 48 పరుగులు సాధించాడు మధ్యలో కేన్ విలియమ్సన్ 12 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. ఇందు 2 భారీ సిక్సుల కూడా ఉన్నాయి. అయితే చివరికి చిన్న స్కోర్ అవడంతో రాజస్తాన్ టీమ్ ఛేజ్ చేయడంలో కాస్త ఇబ్బంది పడినా...సాధించగలిగింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR