Rahul Dravid Appointed Head Coach Of The Indian Men's Cricket Team: టీమిండియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా (Team India New Head Coach) భారత మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యారు. బీసీసీఐ బుధవారం (BCCI on New Head coach) అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది.
హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి (Ravi Sharstri) టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఏక గ్రీవంగా ఎంపిక..
టీమ్ ఇండియా కోచ్ పదవికి గత నెల బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా.. రాహుల్ తన అప్లికేషన్‌ను దాఖలు చేశారు. అప్పటి నుంచే రాహులు తదుపరి కోచ్ అని ప్రచారం సాగింది. బుధవారం ఆ అంచనాలను నిజం చేస్తూ.. ద్రవిడ్‌ను లాంఛనంగా ఎంపిక చేసింది. ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి ఏకగ్రీవంగా ద్రవిడ్‌ను సెలెక్ట్ చేసింది.
Also read: INDIA vs AFG: టీ20 వరల్డ్‌కప్‌లో ఖాతా తెరిచిన భారత్- అఫ్గాన్‌పై ఘన విజయం
Also read: Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..
ఈ నెల నుంచే బాధ్యతలు..
స్వదేశంలో నవంబర్ 17న ప్రారంభంకానున్న న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రవిడ్ హెచ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ తెలిపింది. 2023 వన్డే ప్రపంచకప్ వరకూ కోచ్‌గా రాహుల్ ఉంటారని వివరించింది.
నిజానికి గతంలోనే రాహుల్ ద్రవిడ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ అనుకుంది. అయితే ఈ ఆఫర్‌ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు సౌరభ్ గంగూలీ చొరవతో ద్రవిడ్ సుముకత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also read: Akhanda title song teaser: అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వచ్చేస్తోంది
Also read: Illigal Affair: అంగన్ వాడిలో రాసలీలలు.. 35 ఏళ్ల మహిళతో 14 ఏళ్ల బాలుడు పరార్
రాహుల్ ద్రవిడ్ కోచ్ ప్రస్థానం..
Also read: BCCI about Mohammed Shami: మొహమ్మద్ షమికి అండగా నిలిచిన BCCI
బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లుగా ఎవరో?
ప్రస్తుతం టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఉన్నారు. వారి పదవీ కాలం కూడా టీ20 ప్రపంచ కప్‌తో ముగియనుంది. అయితే విక్రమ్ రాథోడ్ మరోసారి బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి దీనిపై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Also read: India’s batting coach: టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు
Also read: T20 World Cup 2021: విరాట్ కోహ్లీ, ఇండియా టీమ్ మేనేజ్మెంట్‌పై Sunil Gawaskar ఆగ్రహం
Rahul Dravid as India Head Coach: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక
టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
ఏక గ్రీవంగా ఎంపిక చేసిన క్రికెట్ సలహా కమిటీ
ఈ నెల 17 నుంచే కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు