భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. "ది వాల్"గా సుపరిచితుడైన ద్రావిడ్‌కు ప్రతిష్టాత్మకమైన ఐసీసీ "క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్"లో చోటు దక్కింది. భారత్ నుండి ఈ ఘనత పొందిన ఐదవ క్రికెటర్ ద్రావిడ్. ఈ సారి "క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్"లో ద్రావిడ్‌తో పాటు ఆసీస్ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఆయన ఆస్ట్రేలియా నుండి ఈ ఘనత పొందిన 25వ ఆటగాడు.
ఈ సారి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులను ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఇవ్వడం జరిగింది. కాగా, కోచింగ్ పనుల్లో బిజీగా ఉన్న ద్రావిడ్ ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం భారత్ అండర్ 19, భారత్ ఏ టీమ్స్‌కు ద్రవిడ్ కోచింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అగ్రస్థానం పొందిన ద్రావిడ్, 2007లో వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్ గా, సచిన్ టెండుల్కర్ మరియు సౌరవ్ గంగూలీల తర్వాత మూడో భారతీయుడిగా రికార్డును నమోదు చేశాడు.
Although coaching commitments mean Rahul couldn't be here tonight, he has sent this brief message from India as he takes his place among cricket's all-time greats #ICCHallofFame pic.twitter.com/uRSHHurKIc
— ICC (@ICC) July 1, 2018