India Australia Match: భారత్- ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీట్వంటీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో రెండు జట్లు ఒక్కో విజయం సాధించాయి. ఉప్పల్ స్టేడియంలో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుండటంతో చివరి వరకు రసవత్తర పోరు జరిగింది. చివరి ఓవర్ లో ఐదో బంతికి హార్దిక్ పాండ్యా ఫోర్ కొట్టి టీమిండియాకు విజయం అందించారు. అయితే హోరాహోరీగా సాగిన ఉప్పల్ మ్యాచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.
మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ జై శ్రీరాం నినాదాలు చేశారనే ప్రచారం సాగుతోంది. ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచేందుకు జై శ్రీరామ్సాంగ్ వినిపించిందంటూ.. ఇందుకు సంబంధించి ఓ వీడియా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపైనే వివాదం కూడా సాగుతోంది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కొందరు బీసీసీఐకి థ్యాంక్స్ చెబుతూ కామెంట్లు చేశారు. మరికొందరు క్రికెట్ లో హిందూ ముస్లిం ఏంటంటూ మరికొందరు రియాక్ట్ అయ్యారు. మనమంతా భారతీయులమని మరికొందరు కామెంట్ చేశారు.
ఉప్పల్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేశారంటూ వస్తున్న వీడియోపై తాజాగా రాచకొండ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో హైదరాబాద్ స్టేడియంలో జరగలేదని చెప్పారు.ఇలాంటి అసత్య ప్రచారాలు హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చుతాయని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా రాచకొండ పోలీసులు హెచ్చరించారు.
This is incorrect. It didn’t happen in Hyderabad Stadium. Such false propaganda brings down the image of Hyderabad. Suitable action will be taken against the persons doing such false propaganda, misguiding the people.
— Rachakonda Police (@RachakondaCop) September 26, 2022
Also read: Jagga Reddy: జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే..ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Also read:IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook