PV Sindhu, HS Prannoy enters Malaysia Masters 2022 Quarters: మలేషియా మాస్టర్స్ 2022లో భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు దూసుకెళుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో చైనాకు చెందిన జాంగ్ యి మాన్‌పై వరుస గేమ్‌లలో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లింది. ప్రపంచ ఏడో సీడ్ అయిన సింధు ప్రపంచ నంబర్ 32 యి మాన్‌పై 21-12, 21-10తో విజయం సాధించింది. రెండు గేమ్‌లలో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. 28 నిమిషాల్లో మ్యాచును ముగించింది.
క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు గట్టి పోటీ ఎదురుకానుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ నం.2 తాయ్ ట్జు యింగ్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. గతవారం మలేషియా ఓపెన్ 2022లో క్వార్టర్ ఫైనల్స్‌లో సింధును యింగ్ ఓడించిన విషయం తెలిసిందే. సరైన ప్రణాళికతో బరిలోకి దిగితేనే యింగ్‌ను సింధు నిలువరించగలదు. క్వార్టర్ దాటితే తెలుగు తేజం ఫైనల్ వెళ్లే అవకాశాలుంటాయి. తాయ్ ట్జు యింగ్, పీవీ సింధు మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరగ్గా.. హైదరాబాదీ ప్లేయర్ కేవలం 5 మ్యాచులు మాత్రమే గెలిచింది. సింధు హెడ్-టు-హెడ్ రికార్డు అంతగా లేకపోవడం కలవరపెట్టే అంశం.
పురుషుల సింగిల్స్‌లో బి సాయి ప్రణీత్ చైనాకు చెందిన లీ షీ ఫెంగ్ చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచులో ప్రణీత్ 14-21, 17-21తో ఓడిపోయాడు. పారుపల్లి కశ్యప్ 21-10, 21-15తో ఇండోనేషియాకు చెందిన ఆంథోనీ సినిసుకా గింటింగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక హెచ్‌ఎస్ ప్రణయ్ 21-19, 21-16తో త్జు వీ వాంగ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.
Also Read: Sammathame OTT: అప్పుడే ఓటీటీకి 'సమ్మతమే'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Also Read: IND vs ENG 1st T20: భారత్ బౌలింగ్ బాగున్నా.. తొలి టీ20లో ఇంగ్లండే గెలుస్తుంది!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook