Rohit Sharma slams bowlers after India Loss To England in T20 World Cup 2022 Semi Final: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ప్రస్థానం సెమీస్‌తోనే ముగిసింది. పొట్టి టోర్నీలో సూపర్ 12 స్టేజ్‌లో అత్యధికంగా 8 పాయింట్లు సాధించిన భారత్.. నాకౌట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 168 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయిన భారత బౌలర్ల గురించి మాట్లాడకపోవడే మంచిది. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ సెమిస్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. భారత్ ఘోర పరాజయం చెందడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారత్ ఘోర పరాభవంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 'ఈ రోజు ఫలితంతో చాలా నిరాశ చెందా. 168 పరుగులు చేసేందుకు మేము బాగా కష్టపడ్డాం. ఇన్నింగ్స్ చివరలో మా బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్‌లో అంచనాల అందుకోలేకపోయాం. నాకౌట్ గేమ్‌లలో ఒత్తిడిని జయించడం చాలా ముఖ్యం. ఈ రోజు అది చేయలేకపోయాము. ఐపీఎల్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లకు ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసు. వారికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ బాగాలేదని ఒప్పుకోవాల్సిందే' అని రోహిత్ అన్నాడు.
'మేము ఇన్నింగ్స్ ఆరంభంలో భయపడ్డాము. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. ఓపెనర్లకు విజయం క్రెడిట్ ఇవ్వాలి. తొలి ఓవర్‌లో స్వింగ్ అయినప్పటికీ.. సరైన చోట ల్యాండ్ అవలేదు. బ్యాటర్లు షాట్లు ఆడకుండా ఉంటేనే పరుగులు నియత్రించగలం. దురదృష్టవశాత్తు మేము అలా చేయలేకపోయాము. మేము మొదటి గేమ్‌లో గెలిచినప్పుడు చాలా బాగా అనిపించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆట గమ్మత్తైనది. 9 ఓవర్లలో 85 పరుగులను కాపాడుకోవడం కష్టమకున్నాను. కానీ మా ప్రణాళికలు ఫలించాయి. ఈ రోజు ప్రణాళికలు సఫలం కాలేదు. ప్రణాళికలను అమలు కానపుడు.. ఇబ్బందులు తప్పవు' అని రోహిత్ శర్మ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (63; 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (50; 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 170 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్ (80 నాటౌట్; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్; 47 బంతుల్లో4 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
Also Read: Rohit Sharma Crying: బోరున ఏడ్చేసిన రోహిత్ శర్మ.. వైరల్ అవుతున్న వీడియోస్, ఫొటోస్!
Also Read: Virat Kohli: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook