PBKS vs RCB in IPL 2021: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

PBKS vs RCB in IPL 2021: ఐపీఎల్‌ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై  పంజాబ్‌ కింగ్స్‌ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2021, 04:28 AM IST
PBKS vs RCB in IPL 2021: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

PBKS vs RCB in IPL 2021: ఐపీఎల్‌ 2021లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై  పంజాబ్‌ కింగ్స్‌ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ ఖాతాలో ఘన విజయం నమోదైంది.

లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli 35: 34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌), రజత్‌ పటిదార్‌ (31: 30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌), హర్షల్‌ పటేల్‌ (31: 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఫామ్‌లో ఉన్నాడనుకున్న దేవదత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) ఈ మ్యాచ్‌లో 7 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. 

Also read : Eatala Rajender: ఈటల రాజేందర్ మంత్రి పదవిపై వార్తా కథనాలు

గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డకౌట్ కాగా, ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers 3), షాబాజ్‌ అహ్మద్‌ (8), డేనియల్‌ సామ్స్‌ (3) అలా వచ్చి ఇలా పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఛేదించాల్సిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు (Royal Challengers Bangalore) ఓటమి తప్పలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News